వైసిపి నాయకుడు మణి మృతి పార్టీకి తీరని లోటు. – పెద్దిరెడ్డి

పలమనేరు ముచ్చట్లు

రెండు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో బైక్ బోల్తా పడటంతో వైసిపి నాయకుడు మణి అలియాస్ సుబ్రమణ్యం(50) మృతిచెందారు. అతని అకాల మరణం పార్టీకి తీరని లోటు అని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. తొలుత ఆయన నీళ్ళకుంటలోని మృతుని భౌతిక కాయానికి పూలమాల వేసి, నివాళులర్పించారు.కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. పార్టీ పరంగా ఆ కుటుంబ సభ్యులను ఆదుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శారద, నియోజక వర్గ కోఆర్డినేటర్ సివి కుమార్,రాష్ట్ర కార్యదర్శి మొగసాల క్రిష్ణమూర్తి,రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వెంకటేగౌడ,జిల్లా ప్రధాన కార్యదర్శి కూర్మాయి చెంగారెడ్డి,పట్టణ కన్వినర్ మండిసుధ,మండల కన్వినర్లు బాగారెడ్డి,బాలాజినాయుడు,బాలగరునాథం తదితరులు పాల్గొన్నారు.

Tags: ys rajasekhar reddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *