వైసీపీ ని నిర్వీర్యం చేయడం చంద్రబాబు తరం కాదు. – పెద్దిరెడ్డి.

పలమనేరు ముచ్చట్లు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను పదవుల ఆశతో, డబ్బుతో కొనుగోలు చేయడం ద్వారా తమ పార్టీ ని నిర్వీర్యం చేయాలనుకోవడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి తరం కాదని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎద్దేవా చేశారు. గంగవరం మండలానికి చెందిన సాయినగర్ లోని ఎస్టేట్ రమేశ్ నూతన గృహప్రవేశ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు ఎప్పుడు జరిగినా తమపార్టీ అభ్యర్థులు గెలుపొందడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అదేవిదంగా నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ పేరుతో టీడీపీ కొత్త వారికి కూడా లేనిపోని ఆశలు కల్పించి మభ్యపెడుతోందని సీఎం తీరును ఆయన దుయ్యబట్టారు.వైసీపీ కి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను రాజీనామా చేయకుండా టీడీపీ లో మంత్రులుగా కొనసాగించడం, ఇప్పటికీ పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహించడాన్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు.చంద్రబాబు దిగజారుడు రాజకీయాలను ప్రజలు తమ ఓట్ల రూపంలో అంతమొందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలమనేరు పట్టణ మాజీ ఎంపిపి రాజేంద్రన్, రాష్ట్ర కార్యదర్శులు మొగసాల క్రిష్ణమూర్తి, వాసు, సంయుక్త కార్యదర్శి వెంకటేగౌడ, నియోజకవర్గ కోఆర్డినేటర్లు రాకేష్ రెడ్డి, సివి కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి కూర్మాయి చెంగారెడ్డి, నాయకులు ఆకుల గజేంద్ర, కన్వీనర్లు మండీసుధ, బాగారెడ్డి, శరత్ చంద్రారెడ్డి, జిల్లా మైనారిటీ కార్యదర్శి సుహేబ్, శశిధర్నాయుడు, యరబల్లి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *