శిలలో వీణలు మ్రోగె!

జనగామ జిల్లాలో రింగింగ్‌ అండ్‌ సింగింగ్‌ రాక్స్‌!
25 కి.మీల ఏనె.. ఏ రాయిని స్పృశించినా సంగీతమే
సిద్దిపేట, ఖమ్మంలో బృహత్‌ శిలాయుగంనాటి ఆనవాళ్లు
వేల్పుగొండలో పార్శ్వనాథుడి విగ్రహం

కరకు గుట్టలు కావవి.. ఖంగున మోగే గంటలు.. శిలలు కావ వి.. వేల వీణల రాగరంజితాలు. మరోచోట.. బృహత్‌ శిలాయుగం నాటి ఆనవాళ్లు.. ఆదిమానవుడు ఉపయోగించిన పా త్రలు.. ఇంకోచోట.. మొదటి శతాబ్దం నాటి ఆలయాలు.. బౌద్ధులు, జైనుల కాలం నాటి ఆనవాళ్లు.. శాతవాహనులు, కాకతీయుల నాటి గుర్తులు.. ఇవన్నీ మన రాష్ట్రంలోనే ఉన్నా యి!! వీటిపై చారిత్రక పరిశోధకులతో కలిసి ‘ఆంధ్రజ్యోతి’ అందిస్తున్న సమగ్ర కథనం!!

పైపైన చూస్తే అవి మామూలురాళ్లే! మరో రాయితో కొడితే.. సన్నాయి, వీణను పలికిస్తాయి!! వడగళ్ల వానపడితే ఆ బండల నుంచి సవ్వడుల విందే!! ఆదిమానవుడికి ఆవాసాలుగా, తెలంగాణ చరిత్రను సమున్నతంగా నిలబె ట్టే ఈ రింగింగ్‌ అండ్‌ సింగింగ్‌ రాక్స్‌ జనగామ జిల్లాలో ఉన్నాయి. జాతీయ వారసత్వ సంపదగా గుర్తించి పర్యాట క ప్రాంతంగా అభివృద్ధి చేసే అవకాశమున్న ఈ చారిత్రక సంపదను చరిత్ర పరిశోధకుడు రత్నాకర్‌రెడ్డి కనుగొన్నా రు. ఈ రాక్స్‌ జిల్లా కేంద్రానికి 16 మైళ్ల దూరంలోని సోలామైల్‌ గ్రామంలో బయటపడ్డాయి. భూ ఉపరితలంపై అలలుగా ఎగిసిపడినట్టు ఉండే ఈ రాళ్ల వరుస(ఏనె) బచ్చన్నపేట మండలం బోనకొల్లూరు, బండనాగారం, కట్కూ రు, పడమటి కేశ్వాపూర్‌ శివారుతో పాటు సిద్దిపేట జిల్లా లోని వీరన్నపేట, చుంచనకోట, నాగపురి గ్రామాల్లో 25 కి.మీ.కుపైగా విస్తరించి ఉంది. బచ్చన్నపేట, చేర్యాల మండలాల మధ్యలో ఉన్న సోలామైల్‌ ఏనె రాళ్లు తేలికగా పైకెత్తగలిగేలా ఉన్నాయి. గుంటలపై రాయితో కొడితే కమ్మటి సంగీతం వినిపించింది. సంగీత శిలలను రింగింగ్‌ అండ్‌ సింగింగ్‌ రాక్స్‌ అంటారు.

భౌతికశాస్త్రంలో సోనారస్‌ రాక్స్‌, లిథోఫోనిక్‌ రాక్స్‌ అంటారు. భూగోళశాస్త్రం ప్రకారం ఈ శిలలు 20 కోట్ల ఏళ్ల క్రితం ఏర్పడ్డాయి. బసాల్టిక్‌ లావా భూ ఉపరితలంపైకి ఉబికి వచ్చి 10-30 అడుగుల ఎత్తు శిలలుగా ఏర్పడ్డాయి. శిలలలోని అంతర్గత ఒత్తిడి, రాళ్లలోని అణువుల సాంద్రత, రాళ్లలోని ఫెర్రిక్‌ ఆక్సైడ్‌ శాతం, రాళ్ల నిర్మాణం, ఆకృ తి, ఇతర రాళ్లతో అమరిన తీరును బట్టి శిలల నుంచి సంగీతం వినిపిస్తుంది. ఇలాంటి శిలల్లో 9-12% ఇనుము ఉంటుంది. బచ్చన్నపేట మండలం బోనకొల్లూరు గ్రామ శివార్ల గుండా వెళ్లే ఏనెపై పురాతన నారాయణస్వామి ఆలయం ఉంది. వెనకభాగాన రాళ్లకు శంఖు, చక్రా లు, గరుత్మంతుని శిల్పాలు కనిపిస్తాయి.

ఏనెపై బురుజు ఆనవాళ్లు ఉన్నాయి. ఇది పూర్వకాలంలో ’కొల్లాపురి’ పట్టణంగా విలసిల్లిందని కథనం. రత్నాకర్‌రెడ్డికి ఓ రాతిగొడ్డలి లభించింది. సిద్దిపేట జిల్లాలోని చేర్యాల మండలం వీరన్నపేట ప్రాం తంలో ఉన్న సంగీత శిలల్లో ఒక శిల డైనోసార్‌ శిలలా ఉంది. ఇస్త్రీపెట్టె బండ సమీపంలో 50కి పైగా కప్‌మార్క్స్‌ (గుం డ్రటి గుంతలు) ఉన్న భారీ దీర్ఘచతురస్రాకార పు శిల ప్రత్యేక ఆకర్షణగా ఉంది. రాయితో ఒక్కోగుంతపై కొడి తే ఒక్కో సంగీతం పలుకుతుంది. ఇది జాతీయ వారసత్వ సంపదగా గుర్తింపు పొందే అవకాశం ఉందని రత్నాకర్‌ రెడ్డి అన్నారు.

సిద్దిపేట జిల్లాలో 2వేల ఏళ్లనాటి సమాధులు
సిద్దిపేట జిల్లాలో బృహత్‌ శిలాయుగం నాటి ఆనవాళ్లు కనబడ్డాయి. ఇక్కడ వేల ఏళ్ల నుంచి జనజీవనం సాగిందనడానికి రాకాసిగుళ్లు సాక్ష్యాలు. రెండేళ్ల క్రితం జరిపినతవ్వకాల్లో శిలాయుగంనాటి సమాధులు, అస్తిపంజరం, కుండలు, వివిధ పరికరా లు లభించాయి. వీటిని క్రీస్తు పూర్వం 2 వేల ఏళ్ల నాటివిగా గుర్తించారు.94 ఎకరాల పుల్లూరు బండ ఏకశిలపై వెలిసిన లక్ష్మినరసింహస్వామి ఆలయం సమీపంలోనే వెలుగు చూశాయి. అవశేషాల్లోని డీఎన్‌ఏలు ఇరాన్‌, ఇరాక్‌, పాలస్తీనా దేశాల్లోని కొన్ని తెగల డీఎన్‌ఏతో సరిపోయాయి.

ఇం కొన్ని యూరప్‌వాసుల డీఎన్‌ఏతో సరిపోలాయి. నంగునూరు మండలం నర్మెట శివారులోని రాకాసిగుళ్ల మధ్య గల సమాధిలో ఆదిమానవుల నాటి శవం, అప్పటి సామాగ్రి బయటపడింది. బండరాయిపై తవ్విన బావి ఉండటం ప్రత్యేకత. పాలమాకులలో ఒక సమాధిలో మరో సమాధి బయటపడింది. గట్లమల్యాల గ్రామ పంచాయితీ పరిధిలోని సీతారాంపల్లి శివారులో 2 వేల ఏళ్ల క్రితం నాటి శిలాయుగపు ఆనవాళ్లను గుర్తించారు. సమాధుల వద్ద 6 మీటర్ల ఎత్తు స్మారక శిల కనిపించింది. ఆదిమానవుల తెగకు చెందిన పెద్ద మరణిస్తే ఇలాంటి శిలలను సమాధి వద్ద పాతిపెట్టేవారని తెలిసింది.మెదక్‌ జిల్లా టేక్మాల్‌ మండలం వెల్పుగొండ గ్రామంలో ఆదిమానవుడు, శాతవాహను లు, కాకతీయుల కాలంనాటి ఆలయాలు, వస్తువులు వెలుగుచూశాయి. పెద్దచెరువు మధ్యలో దేవులకుచ్చ గుట్టపై ఉన్న గుహ బయట 23వ జైన తీర్థంకరుడు పార్శ్వనాథుడి విగ్రహం ఉంది.

ఫణిగిరి, కొలనుపాకలో బౌద్ధ, జైనుల ఆనవాళ్లు
ఉమ్మడి నల్లగొండ జిల్లా ఫణిగిరి, కొలనుపాక తదితర ప్రాంతాల్లో బౌద్దులు, జైనుల కాలం నాటి ఆనవాళ్లు లభించాయి. తిప్పర్తి మండలంలోనూ బృహత్‌శిలాయుగం, తొలి చారిత్రక యుగపు ఆనవాళ్ళు కనిపించాయి. తిప్పర్తి మండలం పజ్జూరు, ఎర్రగడ్డలగూడెం గ్రామాల మధ్య రైతులకు చారిత్రక వస్తువులు దొరకడంతో కేంద్ర, పురావస్తు శాఖ 60 రోజులు తవ్వకాలు నిర్వహించంది. శాతవాహనకాలం నాటి ఆనవాళ్లు, బౌద్ధుల పూజామందిర(చైత్యం) నిర్మాణాలు వెలుగుచూశాయి. పజ్జూరు గ్రామంలో మానవుల స్మారక శిలలు (మెన్‌హీర్‌), సమాధులు కూడా ఉన్నాయి.

కుటుంబానికో సమాధి
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు బృహత్‌ శిలా సంపదకు నిలయంగా మారాయి. భద్రాచలం, తొగ్గూడెం, పాల్వంచ, జానంపేటతోపాటు, కిన్నెరసాని నదీ ప్రాంతంలోని పడుకోనిగూడెం, దలాబా, కృష్ణాపురం, పాండురంగాపురం, దొంగతోగు, జూపెడలో శిలాయుగం కొనసాగిందనడానికి ఆధారాలు లభించాయి. 2014-15లో శిలాయుగపు సమాధుల్లో మట్టిపాత్రలు, ఎరుపు, నలుపు రంగుల కుండలు, రెండు రంగులు కలిపిన కుండలు, కూజాలు, కొడవలి, ఇనుపకత్తి, ఖడ్గం, రాతి గొడ్డలి ఆనవాళ్లు లభ్యమయ్యాయి.

ఖగోళశాస్త్రం ప్రకారం నిర్మించిన సమాధుల్లో ఒకశవం లేదా, సామూహిక శవాలను ఉంచేవారని అస్థికలను బట్టి తెలుస్తోంది. ఒక కుటుంబం లో చనిపోయినవారిని, పాలకుల కుటుంబీకులను ఒకేసమాధిలో ఉంచేవారని తెలుస్తోంది. భూ అంతర్గత పొరల్లో నిర్మించిన రాతి సమాధులు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. ముసలమ్మ గుట్టల్లో ఆదిమమానవులు గీసిన ముఖ్య చిత్రాలను అధికారులు కనుగొన్నారు.రిపోర్టులను ఢిల్లీకి పంపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *