శ్రీ చైతన్యలో ఆనందాల ఆదివారం లో పాల్గొన్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి

 

పుంగనూరు ముచ్చట్లు

పట్టణంలోని శ్రీచైతన్య టెక్నోస్కూల్‌లో ఆనందాల ఆదివారాన్ని మున్సిపల్‌ కమిషనర్‌ కెఎల్‌.వర్మ , డీన్‌ రామ్మోహన్‌ , ప్రిన్సిపాల్‌ దేవరాజు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అతిధిగా హాజరైయ్యారు. నారాయణ పాఠశాలల్లో పిల్లలకు ఒత్తిడి తీవ్రమై , ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేధన వ్యక్తం చేశారు. శ్రీచైతన్య పాఠశాలలో మానసిక ఉల్లాసం కోసం పిల్లలను, తల్లిదండ్రులను కలిపి ఆనందాల ఆదివారం నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినీలకు పూలచెట్లు  పంపిణీ చేశారు. పాఠశాల చిన్నారుల బ్రేక్‌ డ్యాన్సులతో ప్రజలు పులకరించిపోయి , ఆనందంతో గడిపేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది మధు, జయప్రకాష్‌, బాలరాజు, జఫ్రుల్లా, రహంతుల్లా, నాశ్రీ, సోనియా, మమత, మంజుల , మల్లిక, లక్ష్మి , ఉమ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *