సర్దార్ వల్లభాయ్ పటేల్ ని ఆదర్శంగా తీసుకోవాలి. – దగ్గుపాటి పురందరేశ్వరి

పలమనేరు ముచ్చట్లు

భారత దేశ ఉక్కుమనిషి గా కీర్తింపబడుతున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ ని నేటి నాయకులందరూ ఆదర్శంగా తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ జాతీయ మహిళా మోర్చా నాయకురాలు దగ్గుపాటి పురందరేశ్వరి అన్నారు. మంగళవారం నాడు పలమనేరు పట్టణంలో నిర్వహించిన సర్దార్ వల్లభాయ్ పటేల్142 వ జయంతి ఉత్సవాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశ మొదటి ఉప ప్రధాని గా ఆయన 500 సంస్థానాలను విలీనం చేయడంలో కీలక పాత్ర పోషించాడని తెలిపారు. శత్రు దేశాలను ఎదుర్కొనడంలో ఆయన ప్రదర్శించిన ధైర్య సాహసాలకు భారత ఉక్కుమనిషి గా చరిత్రలో నిలిచిపోయారని ఆయన సేవలను కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కార్‌ సేవలకు గుర్తుగా యూనిటీ ఆఫ్ స్టాట్యు పేరుతో 192 అడుగుల ఎత్తుతో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తుండటం పై సంతోషం వ్యక్తం చేశారు. మోడీ నోట్లరద్దు, జియస్టీ విధానం వల్ల దేశ ప్రజలకు ఆర్థిక వెసులుబాటు కలిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఒబిసి రాష్ట్ర మోర్చా అధ్యక్షుడు జల్లి మధుసూదన్, బిజెపి జిల్లా అధ్యక్షుడు చంద్రారెడ్డి, జిల్లా కార్యదర్శి జగదీశ్వర్ నాయుడు, స్వచ్చభారత్ జిల్లా నాయకుడు క్రిష్ణమూర్తిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు మాదాస్ లోకేష్, జిల్లా కార్యదర్శి జల్లి హరిక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *