అనగనగా ఓ ప్రేమకథ ‘ సెన్సార్ పూర్తి. డిసెంబర్  2  వ వారంలో విడుదల 

Date:14/11/2018
హైదరాబాద్‌ముచ్చట్లు:
‘అనగనగా ఓ ప్రేమకథ ‘
విరాజ్.జె .అశ్విన్ హీరో గా పరిచయం అవుతుండగా థౌజండ్ లైట్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్  పతాకం పై నిర్మితమైన చిత్రం ‘అనగనగా ఓ ప్రేమకథ’.  కె.సతీష్ కుమార్ సమర్పణలో  ప్రతాప్ తాతంశెట్టి   దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో నాయికలుగా రిద్ధి కుమార్ ,రాధా బంగారు నటిస్తున్నారు.  సినిమా రంగంలో ప్రముఖ  ఫైనాన్షియర్ కె.ఎల్.యన్.రాజు ఈ చిత్రానికి నిర్మాత.
ఇటీవలే చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని ‘యు’ సర్టిఫికెట్ పొంది, చూడ చక్కని చిత్రంగా, కుటుంబ సమేతంగా చూసే చిత్రంగా సెన్సార్ సభ్యుల ప్రశంసలు అందుకొంది.
ఈ సందర్భంగా..చిత్ర నిర్మాత కె.ఎల్.యన్.రాజు మాట్లాడుతూ..’ సినీ పరిశ్రమలో నిర్మాతగా, ఎన్నో చిత్రాలకు ఫైనాన్షియర్ గా వ్యహరించిన నేను ఆతరువాత నా వ్యాపారాలలో బిజీగా ఉండటం జరిగింది. చాలాకాలం తరువాత చిత్రాలను నిర్మించాలన్న ఆలోచనలో భాగంగా కధలను వింటూ వస్తుండగా ఈ చిత్ర దర్శకుడు ప్రతాప్ చెప్పిన కధవిని చిత్రాన్ని నిర్మించటం జరిగింది. అదే ఈ ‘అనగనగ ఓ ప్రేమకథ’. మా మావగారు చిత్రసీమలో సుప్రసిద్ధులైన శ్రీ డి.వి.ఎస్.రాజు గారు. ఆయన ఎన్నో  ఉత్తమ చిత్రాలను నిర్మించటమే కాదు, నూతన ప్రతిభా శీలురులను పరిచయం చేసేవారు.
అదేవిధంగా ఈ చిత్రం ద్వారా హీరో, నాయికలు, దర్శకుడు కూడా కొత్తవారే. అయినా ప్రతిభావంతులు. ఎంతో మందిని పరిశీలించిన తరువాత వీరిని ఎంపిక చేయటం జరిగింది. హీరో అశ్విన్ చక్కని నటుడు. స్టార్ మేకర్ సత్యానంద్ గారు వద్ద నటనలో నైపుణ్య సాధించాడు.
నాయికలలో ఒకరైన రిద్ధి కుమార్ కిది నిజానికి తొలిచిత్రం. ఈ చిత్రం ప్రారంభమైన తొలిన్నాళ్లలోనే ప్రముఖ నిర్మాత దిల్ రాజు గారు నిర్మించగా విడుదలైన ‘లవర్’ చిత్రంలో అవకాశం రావటం జరిగింది. సంగీత దర్శకుడు కె.సి.అంజన్, ఛాయాగ్రాహకుడు ఎదురొలు రాజు లకు కూడా ఇదే తొలిచిత్రం. ఇలా కొత్త వారితో నేను ఓ మంచి చిత్రాన్ని నిర్మించానన్న నమ్మకం చిత్రం తొలి కాపీని చూసినప్పుడు, సెన్సార్ వారి ప్రశంసలు అందుకొన్నప్పుడు కలగటమేకాదు, సగటు సినిమా ప్రేక్షకుడికి తప్పకుండా నచ్చుతుందనే నమ్మకం మరింత పెరిగింది.
కుటుంబ సభ్యులంతా కలసి చూసే చిత్రం గా ఇది ఉంటుందని చెప్పగలను. ప్రేమ కధా చిత్రాలకు ప్రాణం కథ. దానిని నడిపే తీరు, కధకు తగిన సంగీతం, వాటికి తగిన సాహిత్యం, వాటి చిత్రీకరణ, నటీ నటుల అభినయం, సహజంగా సాగే సంభాషణలు ఈ చిత్రానికి ఎంతో చక్కగా సమకూరాయి. అలాగే  ఈ చిత్రం హైదరాబాద్, అరకు, విశాఖపట్నం , మలేసియా, లంకావి వంటి  ఎన్నో లొకేషన్ లలో చిత్రీకరణ జరుపుకుంది.
ఇంతకు ముందు చెప్పిందే అయినా  ఈ చిత్రం టీజర్ ను ప్రముఖ హీరో రాణా విడుదల చేశారు. అలాగే చిత్రంలోని గీతాలను  ప్రముఖ దర్శకులు మణిరత్నం, పూరి జగన్నాధ్, శేఖరకమ్ముల, పరశురామ్ లు విడుదల చేశారు. థియేట్రికల్ ట్రైలర్ ను గోపీచంద్ గారు  విడుదల చేశారు. వీరందరికీ మరోసారి మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు. ఇంతమంది విజయవంతమైన చిత్రాల దర్శకులు హీరోలు విడుదల చేయటం,
ఈ చిత్రం కూడా మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు నిర్మాత కె.ఎల్.ఎన్.రాజు. సెన్సార్  కార్యక్రమాలను పూర్తి చేసుకొన్న ఈ చిత్రం ను డిసెంబర్ 2 వ వారంలో విడుదల చేస్తున్నాము. చిత్రం  విడుదల తేదీని, అలాగే ప్రీ రిలీజ్ వేడుక వంటి వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని నిర్మాత   కె.ఎల్.యన్.రాజు తెలిపారు.  ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రలలో కాశీవిశ్వనాధ్, అనీష్ కురువిళ్ళ, వేణు (తిళ్ళు) తదితరులు నటిస్తున్నారు.
ఈ చిత్రానికి సంగీతం: కె.సి.అంజన్, పాటలు:శ్రీమణి, కెమెరా: ఎదురొలు రాజు, ఎడిటర్: మార్తాండ్.కె.వెంకటేష్, ఆర్ట్: రామాంజనేయులు, నృత్యాలు: అనీష్, పోరాటాలు:రామకృష్ణ
Tags; A love story ‘full of sensor. Released in the 2nd week of December

సిరివెన్నెల”గా ప్రియమణి

Date:10/11/2018
హైదరాబాద్‌ముచ్చట్లు:
ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకొని ఎన్నో ప్రశంసలు అందుకున్న ప్రియమణి… తెలుగులో పలు కమర్షియల్ చిత్రాల్లో నటించి మెప్పించింది. పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు కాస్త దూరమైంది. అయితే తాజాగా ఓ చిత్రంలో నటించేందుకు ఒప్పుకుంది. ఏ ఎన్ బి కోర్డినేటర్స్ బ్యానర్ పై ఏ ఎన్ భాషా, రామ సీత నిర్మాతలుగా ప్రకాష్ పులిజాల దర్శకత్వంలో తెరకెక్కించనున్న “సిరివెన్నెల” అనే చిత్రం ద్వారా ప్రియమణి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయనుంది.
తెలుగు చిత్ర సీమలో క్లాసిక్ మూవీగా చెప్పుకునే “సిరివెన్నెల” సినిమా టైటిల్ ఇన్నాళ్ల తర్వాత మరోసారి వెలుగులోకి వచ్చింది. ప్రియమణి చాలా కథలు విన్నప్పటికీ “సిరివెన్నెల” కథ బాగా నచ్చడం పెర్ ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పాత్ర కావడంతో నటించేందుకు ఒప్పుకుంది. ప్రియమణికి పర్ ఫెక్ట్ సెకండ్ ఇన్నింగ్స్ మూవీగా సిరివెన్నెల ఉండనుందని దర్శక నిర్మాతలు చెబుతున్నారు.
ఈ చిత్రంలో ప్రియమణితో పాటు… జూనియర్ మహానటిగా మంచిపేరు తెచ్చుకున్న సాయి తేజస్విని, బాహుబలి చిత్రంలో కిలి కిలి భాషతో భయంకరమైన విలన్ గా నటించిన కాలకేయ ప్రభాకర్, సీనియర్ నటుడు అజయ్ రత్నం, రాకెట్ రాఘవ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
Tags: Sirivennela “as Priyamani

మాస్ డైలాగ్స్ తో అదరగొడుతున్న రామ్ 

Date:09/11/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
మెగా పవర్స్టార్ రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన ‘వినయ విధేయ రామ’ టీజర్ వచ్చేసింది. ఆద్యంతం యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ టీజర్లో రామ్ చరణ్ లుక్ అదిరిపోయింది. అలాగే అన్నా వీడిని చంపేయాలా..? భయపెట్టాలా..? భయపెట్టాలంటే పది నిమిషాలు, చంపేయాలంటే పదిహేను నిమిషాలు ఏదైనా ఓకే సెలక్ట్ చేసుకో.. ఇక్కడ రామ్..
రామ్ కొణిదెల లాంటి మాస్ డైలాగ్స్తో అదరగొట్టాడు చరణ్.  కత్తి దూస్తూ ఉగ్రరూపం దాల్చాడు రామ్ కొణెదల. దీపావళి కానుకగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘వినయ విధేయ రామ’ ఫస్ట్ లుక్కి అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో శుక్రవారం ఈ మూవీ టీజర్ను విడుదల చేసింది చిత్రయూనిట్. రామ్ చరణ్, బోయపాటి కాంబోలో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్ర టైటిల్, ఫస్ట్లుక్తో అంచనాలను పెంచేసింది.
టైటిల్లో వినయం ఉన్నప్పటికీ రామ్ చరణ్లో వీరత్వాన్ని చూపించారు దర్శకుడు బోయపాటి. టీజర్కు దేవీ శ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్గ్రౌండ్ కూడా ఆకట్టుకుంది. మొత్తానికి టీజర్తో సినిమాపై అంచనాలను పెంచేశాడు చెర్రీ.ఈ చిత్రంలో చెర్రీ సరసన కియారా నటించింది. స్నేహ, ప్రశాంత్, ఆర్యన్ రాజేశ్, వివేక్ ఒబెరాయ్ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా రానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.
Tags: Ram, who has been upset with mass dialogues

సినీ పరిశ్రమ తరలింపుపై రాని క్లారిటీ

Date:09/11/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
ఏపీ, తెలంగాణ విభజన తర్వాత ప్రముఖంగా చర్చకొచ్చిన తొలి అంశం సినీపరిశ్రమ తరలింపు. టాలీవుడ్ హైదరాబాద్ నుంచి తరలి వెళ్లిపోతోందని, బీచ్ సొగసుల విశాఖ నగరంలో పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నారని తామరతంపరగా వార్తలొచ్చాయి. ఒకానొక సందర్భ ంలో హైదరాబాద్ ఫిలింఛాంబర్‌లో జరిగిన ఓ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు కేటీఆర్ ఈ విషయంపై ముచ్చటిస్తూ హైదరాబాద్ పరిశ్రమకు ధీటుగా మరో కొత్త పరిశ్రమ రూపకల్పనకు ఏపీ ప్రభుత్వం సన్నాహకాల్లో ఉందని ప్రకటించారు.
అదే విషయంపై రకరకాల సందర్భాల్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ను సినీపెద్దలు కలవడంతో వైజాగ్ ఫిలింఇండస్ట్రీ గురించి ఆసక్తికర చర్చ సాగింది. నంది అవార్డుల వేళ నేరుగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడునే సంప్రదిస్తే ఒక కొత్త పరిశ్రమ నిర్మాణం మాత్రం ఖాయం అంటూ ప్రకటన చేశారు. ఆ సంగతిని సినీపెద్దలు సైతం మీడియా ముఖంగా తెలియజేశారు. కానీ ఎందుకనో ఇంకా కొత్త పరిశ్రమ ఏర్పాటు విషయంలో అస్పష్టత నెలకొంది. ఇలాంటి సందిగ్ధ సమయంలోనే ఏపీఎఫ్‌డీసీ నుంచి ఓ అధికారిక ప్రకటన వెలువడింది.
దాని సారాంశం.. విశాఖ నగరంలో కాపులుప్పాడ నుంచి భీమిలి పరిసరాల్లో ఒక కొత్త సినీపరిశ్రమ ఏర్పాటునకు చంద్రబాబు సుముఖంగా ఉన్నారు.చెన్నయ్ కి చెందిన ప్రతిష్ఠాత్మక ఏవీఎం స్టూడియోస్, నందమూరి బాలకృష్ణ వైజాగ్‌లో స్టూడియోలు నిర్మించేందుకు దరఖాస్తు చేసుకున్నారన్నది దాని సారాంశం. వీరికి భూములు కేటాయింపు ఉంటుందని ఎఫ్‌డీసీ అధికారికంగా ప్రకటించింది. ఇది సీఎం చంద్రబాబు ఆజ్ఞల ప్రకారం, ఎఫ్‌డీసీ అధ్యక్షుడు అంబికా కృష్ణ చేసిన ప్రకటన. పరిశ్రమ తరలింపు అని దీనిని అనలేను కానీ, ఓ కొత్త సినీపరిశ్రమ ఏర్పాటు మాత్రం జరుగుతుంది. ఆ మేరకు ప్రభుత్వం సన్నాహకాల్లో ఉంది. కానీ దీనిపై నాకు పూర్తి అవగాహన లేదు..
అంటూ అసలు విషయం చెప్పకుండా దాటవేశారు.వైజాగ్‌లోనే పరిశ్రమ నెలకొల్పుతారా? అన్న ప్రశ్నకు.. పరిశ్రమ ఏర్పాటునకు ఎమినీటీస్ ముఖ్యం. క్యాపిటల్ సిటీ అమరావతిలోనే అయితే బావుంటుందని భావిస్తున్నారని ఓ అస్పష్టమైన సమాధానం ఇచ్చారు. విజయవాడ– అమరావతితో పోలిస్తే వైజాగ్, అరకులో వాతావరణం ఎంతో చల్లగా ఉంటుంది. అందుకే పరిశ్రమను అక్కడ ఏర్పాటు చేయాలని అనుకున్నారని తెలిపారు.
ఈ స్పష్టత లేని ప్రకటనలతో కొత్త పరిశ్రమ వైజాగ్‌లోనా?  అమరావతిలోనా? అన్నదానిపై క్లారిటీ రావడం లేదు.  దానిపై ఏపీ ప్రభుత్వానికే పెద్దంతగా క్లారిటీ లేదని అర్థమవుతోంది. లేదూ కొత్త పరిశ్రమ ఏర్పాటు గురించి కీలకమైన సమాచారాన్ని రివీల్ చేయకుండా దాచేస్తున్నారా? అన్న గందరగోళంపైనా సినీవర్గాల్లో చర్చ సాగుతోంది.
Tags;Clarity that does not come from the film industry

ఆప‌రేష‌న్ గోల్డ్ ఫిష్` ఫ‌స్ట్‌లుక్‌కి ట్రెమెండ‌స్ రెస్పాన్స్‌

Date:08/11/2018
హైదరాబాద్‌ముచ్చట్లు:
శ‌షా చెట్రి(ఎయిర్ టెల్ మోడ‌ల్‌) ,ఆది సాయికుమార్, కార్తీక్ రాజు, పార్వ‌తీశం, నిత్యా న‌రేశ్,  మ‌నోజ్ నందం, కృష్ణుడు, అబ్బూరి ర‌వి, అనీశ్ కురువిల్లా, రావు ర‌మేశ్‌ కీల‌క పాత్ర‌ధారులుగా రూపొందుతోన్న  యాక్ష‌న్ , రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ `ఆప‌రేష‌న్ గోల్డ్ ఫిష్‌`. వినాయ‌కుడు టాకీస్ బ్యాన‌ర్‌పై య‌థార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందించిన క‌ల్పిత కథాంశంతో..
` వినాయ‌కుడు, విలేజ్‌లో వినాయ‌కుడు, కేరింత` వంటి సెన్సిబుల్ చిత్రాల‌ను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు అడివి సాయికిర‌ణ్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది.  ప్రతిభా అడివి, కట్ట ఆశిష్ రెడ్డి, కేశవ్ ఉమా స్వరూప్ , పద్మనాభ రెడ్డి, గేరి.బిహెచ్, సతీష్ డేగల, ఆర్టిస్ట్స్ మరియు టెక్నీషియన్స్ నిర్మాత‌లు.  ఓ సినిమాలో ప‌నిచేసే యూనిట్ స‌భ్యులంద‌రూ క‌లిసి ఓ సినిమా నిర్మాణంలో  భాగ‌మ‌వ‌డం ఇదే తొలిసారి. దీపావ‌ళి సంద‌ర్భంగా ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను రానా ద‌గ్గుబాటి విడుద‌ల చేశారు.
ఇందులో ఆది సాయికుమార్ క్యారెక్ట‌ర్‌ను అర్జున్ పండిట్ అనే ఎన్‌.ఎస్‌.జి క‌మెండోగా ఈ లుక్‌లో చూపించారు. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు సాయికిర‌ణ్ అడివి మాట్లాడుతూ “ఫ‌స్ట్‌లుక్‌కు హ్యూజ్ రెస్పాన్స్ రావ‌డం చాలా ఆనందంగా ఉంది. ప్ర‌స్తుతం సినిమా ఫైన‌ల్ షెడ్యూల్‌ను కార్గిల్‌(జ‌మ్ము &కాశ్మీర్‌), హిమాచ‌ల్ ఫ్ర‌దేశ్‌ల‌లో చిత్రీక‌రించాం.
-10 డిగ్రీల చ‌లిలో 9000-13500 అడుగుల ఎత్తులో సినిమా షూటింగ్ చేస్తున్నాం. మా యూనిట్ ఎంత‌గానో క‌ష్ట‌ప‌డుతున్నారు. త్వ‌ర‌లోనే టీజ‌ర్‌ను విడుద‌ల చేస్తాం. నిజ ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని రాసుకున్న ఫిక్ష‌న‌ల్ స్టోరీ ఇది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసిన త‌ర్వాత సినిమాను విడుద‌ల తేదీని ప్ర‌క‌టిస్తాం“ అన్నారు.
Tags: Operation Goldfish` first trumpend response

డిసెంబర్ 21 న విడుదల కాబోతున్న శర్వానంద్, సాయి పల్లవి ల ‘పడి పడి లేచే మనసు’.. !!

Date:08/11/2018
హైదరాబాద్‌ముచ్చట్లు:
శర్వానంద్, సాయిపల్లవి జంటగా టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో వస్తున్న క్రేజీ చిత్రం ‘పడి పడి లేచే మనసు’.. ఇటీవలే టీజర్ విడుదల అవగా 3.5 మిలియన్ వ్యూస్ తో ప్రేక్షకుల నుంచి బ్రహ్మాండమైన స్పందన లభించింది. కాగా సినిమాకు సంబంధించిన మొదటి పాట వివరాలను చిత్ర  నిర్మాతలు ప్రకటించారు.. నవంబర్ 12న సినిమా యొక్క టైటిల్ సాంగ్ ని రిలీజ్ చేయనున్నారు. మురళి శర్మ, సునీల్ లు ఇతర ముఖ్య పాత్రలను పోషిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ కి విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూరుస్తున్నారు.. హైదరాబాద్, కోల్ కతా, నేపాల్ ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా చిత్రీకరణ చివరిదశలో ఉంది.. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి సినిమాని నిర్మిస్తుండగా డిసెంబర్ 21 న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.
తారాగణం : శర్వానంద్, సాయి పల్లవి, మురళీ శర్మ, సునీల్, ప్రియదర్శి, అభిషేక్ మహర్షి.
Tags; Sharmanand and Sai Pallavi are going to be released on December 21th.

అమర్ అక్బర్ ఆంటోనీ’లో తన పాత్రకు డబ్బింగ్ చెప్పిన ఇలియానా..!!

Date:08/11/2018
హైదరాబాద్‌ముచ్చట్లు:
మాస్ మహా రాజా రవితేజ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమా తో టాలీవుడ్ కి రీ ఎంట్రీ ఇస్తున్న ఇలియానా ఈ సినిమాలోని తన పాత్రకు డబ్బింగ్ చెప్పింది…ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న ఇలియానా తన పాత్రకు తానే స్వయంగా డబ్బింగ్ చెప్పగా, తెలుగులో డబ్బింగ్ చెప్పడం ఆమెకు ఇదే మొదటిసారి..
పాత్ర డిమాండ్ చేయడంతో ఇలియానా  పాత్రకు తనతోనే డబ్బింగ్ చెప్పించాలని శ్రీనువైట్ల ఇలా ప్లాన్ చేయగా నాలుగు రోజుల్లోనే ఇలియానా తన డబ్బింగ్ పార్ట్ ని పూర్తి చేయడం విశేషం..రవితేజ హీరో గా నటిస్తుండగా రవితేజ తో ఇలియానా కి ఇది నాలుగో సినిమా.. ఇప్పటికే ఈ కాంబినేషన్ కి ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది దాంతో సినిమా పై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి.. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం యొక్క ప్రీ రిలీజ్ ఫంక్షన్ నవంబర్ 10 న ఎంతో గ్రాండ్ గా జరగనుంది..
నవంబర్ 16 న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానుంది.. ఎస్ఎస్ థ‌మ‌న్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తుండగా.. వెంక‌ట్ సి దిలీప్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. తారాగణం: రవితేజ, ఇలియానా, సునీల్, లయ, వెన్నెల కిషోర్, రవిప్రకాష్, తరుణ్ అరోరా, ఆదిత్య మీనన్, అభిమన్యు సింగ్,విక్రమ్ జిత్, రాజ్‌వీర్ సింగ్, శుభలేఖ సుధాకర్, శియాజీ షిండే తదితరులు.
Tags: I am dubbing for his role in Amar Akbar Antony!

నవంబర్ 13 న రవితేజ, వి ఐ ఆనంద్, రామ్ త‌ళ్లూరి, ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ‌క్ష‌న్ నెం 3 టైటిల్ లోగో విడుదల

Date:08/11/2018
హైదరాబాద్‌ముచ్చట్లు:
మాస్ మహారాజా రవితేజ, వి ఐ ఆనంద్ దర్శకత్వంలో ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ వారు ప్రొడ‌క్ష‌న్ నెం 3 ని మొద‌లుపెట్ట‌బోతున్నారు. రామ్ తాళ్ళూరి ఈ చిత్రాన్ని భారీగా నిర్మించనున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్ లో సినిమా అనగానే ట్రేడ్ వర్గాల్లో అప్పుడే ఆసక్తి మొదలైంది. న‌వంబ‌ర్ 13న ఈ చిత్రం పేరుని అధికారికంగా ప్ర‌క‌టించ‌డంతో పాటు టైటిల్ లోగోని లాంచ్ చేయనున్నారు. రవితేజ త‌న‌ కెరీర్ లో తొలిసారిగా సైంటిఫిక్ కథాంశంతో తెరకెక్కే చిత్రంలో నటించబోతున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత రామ్ తళ్ళూరి మాట్లాడుతూ… ముందుగా తెలుగు ప్రేక్షకులందరు ఈ దీపావళిని ఆనందోత్సాహాలతో ప్రత్యేకంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం. మాస్ మహారాజా రవితేజ గారితో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయడం చాలా ఆనందంగా ఉంది. దర్శకుడు వి ఐ ఆనంద్ చెప్పిన కథ అద్భుతంగా ఉండడంతో ఓకే చేసి ప్రాజెక్ట్ ని ప్రారంభించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాం. రవితేజ గారు ఇప్పటివరకు ట‌చ్ చేయని జాన‌ర్ లో ఈ సినిమా తెర‌కెక్క‌నుంది.
ఓ  సైంటిఫిక్ కథలో మొద‌టిసారిగా ర‌వితేజ‌ నటించనున్నారు. మా బ్యానర్ వాల్యు ని మ‌రింత‌ పెంచే విధంగా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాం. ఈ చిత్రానికి కొన్ని క్రేజీ టైటిల్స్ అనుకుంటున్నాం. అన్ని వర్గాల్ని ఎంటర్టైన్ చేసే విధంగా ఈ సినిమా ఉండనుంది. నవంబ‌ర్13న సినిమా టైటిల్ ని అధికారికంగా ప్ర‌క‌టించ‌డంతో పాటు‌ లోగోని లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం అని అన్నారు.
Tags: Ravi Teja, Vai Anand, Ram Thaloori, SRT Entertainments Production No. 3 Title Logo Released on 13th November