సీఎం కేసీఆర్ పర్యటనలో అపశృతి

హైదరాబాద్ ముచ్చట్లు

తెలంగాణ సీఎం కేసీఆర్ పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. ఇవాళ మధ్యాహ్నం షాద్‌నగర్ మండంలోని ప్రసిద్ధ జహంగీర్‌పీర్ దర్గాను సీఎం కేసీఆర్ సందర్శించుకోవడానికి వెళ్తుతుండగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వాహనం కానిస్టేబుల్‌ను ఢీ కొన్నది. ఈ ఘటనలో కీసర పొలీసుస్టేషన్‌కు చెందిన రవి కిరణ్‌కు గాయాలయ్యాయి. అత్యవసర చికిత్సకై హుటాహుటిన స్థానిక ఆస్పత్రి తరలించి వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం రవికిరణ్ పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *