సుప్రీం, హైకోర్టు జడ్జీలకు పెరిగిన డీఏ-కేంద్రమంత్రివర్గం ఆమోదం కోసం ఆగిన జీతాల పెంపు బిల్లు

న్యూఢిల్లీ ముచ్చట్లు:

సుప్రీంకోర్టు, 24 హైకోర్టుల జడ్జీలకు కరవుభత్యం (డీఏ) పెరిగింది. వీరి జీతాల పెంపు ప్రతిపాదన కేంద్ర క్యాబినెట్ ఆమోదం కోసం పెం డింగ్‌లో ఉన్నది. పెరిగిన దానిప్రకారం డీఏ 136 శాతం నుంచి 139 శాతానికి చేరిందని, ఇది ఈ ఏడాది జూలై 1 నుంచి వర్తిస్తుందని న్యాయ శాఖలోని న్యాయవిభాగం తెలిపింది.ఆల్ ఇండియా సర్వీస్ సభ్యులకు ఇస్తున్నట్లే వీరికి డీఏను ఇచ్చినట్టు పేర్కొన్నది. సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్, హైకోర్టుల రిజిస్ట్రార్ జనరల్‌లకు ఈ మేరకు గతనెల న్యాయవిభాగం లేఖ పంపింది. ఆరోవేతన సంఘం ప్రకారమే జడ్జీలకు డీఏ పెంచినట్టు తెలిపింది. ఏడో వేతన సంఘం కింద ప్రయోజనాలు కలిగించే రెండు బిల్లులు..సుప్రీంకోర్టు జడ్జీల జీతాలు, భత్యాలకు సంబంధించినది ఒకటి, హైకోర్టు జడ్జీల జీతాలకు సంబంధించినది మరొకటి కేంద్ర క్యాబినెట్ ఆమోదం కోసం పెం డింగ్‌లో ఉన్నాయి. క్యాబినెట్ ఆమోదించాక వీటి ని పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో సభ ముం దుకు తేనున్నారు. అత్యున్నత న్యాయస్థాన సి బ్బంది, అధికారులకు దుస్తుల పరిశుభ్రత భత్యం (వాషింగ్ అలవెన్స్) నిధుల మంజూరు కోసం గ తవారం జస్టిస్ జే చలమేశ్వర్, జస్టిస్ ఎస్ అబ్దుల్ నాజిర్ ధర్మాసనం ఎదుట వాదనలు జరిగాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *