సులభ తరహ వ్యాపారాలలో శ్రీకాకుళంకు రాష్ర్టంలో మొదటి ర్యాంకు- ప్రవేశపెట్టిన పరిశ్రమల జిఎం గోపాలక్రిష్ణకు కలెక్టర్ ప్రశంసలు

శ్రీకాకుళం ముచ్చట్లు

శ్రీకాకుళం జిల్లాలో ఎన్నడు లేని విధంగా తొలిసారిగా సులభ తరహ వ్యాపారాలలో రాష్ర్ట స్థాయిలో అగ్రస్థానం లభించింది . 13 జిల్లాల వారిగా చేపట్టిన నివేదికల్లో శ్రీకాకుళం జిల్లా విజయఢంక మ్రోగించింది. . పరి శ్రమశాఖ క్రూషికి ఫలితం ధక్కింది. ఈమేరకుసోమవారం వ్యాపారులకు, పారిశ్రామిక వేత్తలకు అవగాహన సదస్సు  జిఎం గోపాలకృష్ణ ఆధ్వర్యంలో సదస్సు ను నిర్వహించారు.  హించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జిల్లా కలెక్టరు ధనుంజయరెడ్డి హజరెయ్యారు. జిఎం గోపాలకృష్ణ రూపొందించిన సులభ తరహ వ్యాపార విధి విదానాలను పరిశీలించి కలెక్టర్ గోపాలకృష్ణ ను అబినందించారు. ఈతరహాలో తమ వ్యాపారాలను చేపట్టి ఉత్తమ వ్యాపారులుగా రాష్ర్ట స్థాయిలో శ్రీకాకుళం జిల్లాకు మొదటిస్థానం రావడం హర్షనీయమని కలెక్టర్ కొనియాడారు. ఈ తరహ పద్దతులను అవలంభిస్తే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందేందుకు వీలుంటుందని కొనియాడారు. ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, అనధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *