సైన్సుతోనే సామాజిక అభివృద్ధి సాధ్యం.  – ఎంఈఓ హేమలత

పెద్దపంజాణి ముచ్చట్లు
నేటి ఆధునిక సమాజంలో సైన్సు అన్ని రంగాలలోను ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. సైన్సుతోనే సామాజిక అభివృద్ధి సాధ్యమవుతుందని ఎంఈఓ హేమలత తెలిపారు. విద్యార్థి దశలోనే మూఢ నమ్మకాలను విడనాడాలని, సైన్సు పై ఆసక్తి పెంపొందించుకోవాలని ఆమె సూచించారు.విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని భావితరాలకు శాస్త్రవేత్తలు గా ఎదగాలని  ప్రధానోపాధ్యాయుడు చంద్రశేఖర్ రెడ్డి ఆకాంక్షించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జనవిజ్ఞాన వేదిక మరియు సర్వశిక్ష అభియాన్ సంయుక్త ఆద్వర్యంలో విద్యార్థులకు ‘చెకుముకి సైన్సు సంబరాలు – 2017’ అనే పోటీ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో పలు పాఠశాలల నుంచి విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను కనబరిచారు. ఇంగ్లీషు మీడియం నందు ప్రథమస్థానంలో రాయలపేట ఉన్నత పాఠశాల విద్యార్థులు, ద్వితీయ స్థానంలో శంకర్రాయలపేట ఉన్నత పాఠశాల విద్యార్థులు నిలిచారు. అదేవిధంగా తెలుగు మీడియం నందు ప్రథమస్థానంలో కరసనపల్లె ఉన్నత పాఠశాల విద్యార్థులు, ద్వితీయ స్థానంలో నేలపల్లె ఉన్నత పాఠశాల విద్యార్థులు నిలిచారు. అనంతరం గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జెవివి నాయకుడు జి. ఆంజప్ప, సిద్దార్థ, జివి రమణ, సైన్సు ఉపాద్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Tag : Social development with science is possible. – MEC Hemalatha


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *