స్కూల్ బస్సులో మంటలు.. తప్పిన పెనుప్రమాదం

న్యూఢిల్లీ ముచ్చట్లు :

ఢిల్లీలో పెనుప్రమాదం తప్పింది. పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ఘటన దౌలా కౌన్ ప్రాంతంలో చోటు చేసుకుంది. అయితే బస్సులో ఇంజిన్ భాగంలో మంటలు చెలరేగడాన్ని డ్రైవర్ గమనించి అప్రమత్తమయ్యాడు. దీంతో బస్సులో విద్యార్థులందరినీ హుటాహుటిన కిందకు దించేశారు. ఘటనాస్థలికి చేరుకున్న మూడు ఫైరింజన్లు మంటలను అదుపు చేశాయి. డ్రైవర్ అప్రమత్తతో విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 30 మంది విద్యార్థులున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *