హెడ్‌కానిస్టేబుల్‌ సుజాత కు ఉత్తమ వార్డెన్‌ అవార్డు

చిత్తూరు ముచ్చట్లు

చిత్తూరు జిల్లా కేంద్రంలోని పోలీస్‌ శిక్షణా సంస్థ వార్డెన్‌గా పని చేసిన హెడ్‌కానిస్టేబుల్‌ సుజాతకు ఉత్తమ వార్డెన్‌ అవార్డును జిల్లా ఏఎస్పీ రాధిక ప్రధానం చేశారు. రాష్ట్ర పోలీసుల సంఘ నాయకుకుడు విశ్రాంత ఎస్‌ఐ మురళిక్రిష్ణ సతీమణి, హెడ్‌కానిస్టేబుల్‌ సుజాతను జిల్లాలో ఉత్తమ పోలీస్‌వార్డెన్‌గా ఎంపిక చేశారు. పోలీసుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని అవార్డుల కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ రాజశేఖర్‌బాబు చేపట్టారు. ఈ సందర్భంగా ఏఎస్పీ రాధిక , ఎస్పీ సతీమణి డాక్టర్‌ మంజులశేఖర్‌ కలసి ఉత్తమ వార్డెన్‌ అవార్డును హెడ్‌కానిస్టేబుల్‌ సుజాతకు ప్రధానం చేశారు. పోలీస్‌శాఖలో క్రమశిక్షణ పోలీసులకు ఎంతో అవసరమని ఎస్పీ సూచించారు. క్రమశిక్షణతో పోలీసులను విధులు నిర్వహిస్తున్నారని అభినందించారు. సాంకేతిక పరంగా జిల్లాలో పోలీస్‌ యంత్రాంగాన్ని తయారు చేస్తామని ఎస్పీ ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *