హైదరాబాద్‌లో అకస్మాత్తుగా విరిగిపడిన విమానం డోర్..

హైదరాబాద్‌ ముచ్చట్లు:

ఆకాశంలో అతివేగంగా ప్రయాణిస్తున్న ఓ విమానం డోర్ అకస్మాత్తుగా కింద పడిపోయింది. ఇంకేముంది ఆ ప్రాంతంలో ఉన్న స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఈ సంఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. లాలాపేటలో ఓ భవనంపైన విమానంలోని ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్స్‌ మూత పడిపోయింది. దీంతో ఆ భవనంలో ఉన్నవారంతా బయటకు పరుగులు తీశారు. భవనంపై ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిపోయింది. ఈ సంఘటనలో ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *