హైదరాబాద్‌లో కలకలం: ఒకేచోట ఇద్దరు అమ్మాయిలు, ఓ మహిళ సహా 5 మృతదేహాలు

హైదరాబాద్ ముచ్చట్లు:

హైదరాబాద్‌లో ఓ చోట రెండు యువతుల, ఓ మహిళ, రెండు పురుషుల మృతదేహాలు లభ్యం కావడం కలకలం రేపుతోంది. నార్సింగి సమీపంలోని కొల్లూరు వద్ద వారి మృతదేహాలు లభ్యమయ్యాయి.నిర్మానుష్య ప్రాంతంలో వారు విగతజీవులుగా పడి ఉన్నారు. ఇద్దరు యువతులు ఇరవై ఏళ్ల వయస్సులో ఉన్నవారే. మరో మహిళకు నలభై ఐదు నుంచి యాభై ఏళ్ల వయస్సు ఉంటుంది. మరో ఇద్దరు పురుషులు. ఎవరో హత్య చేసి ఇక్కడ పడేసి వెళ్లి ఉంటారని అనుమానిస్తున్నారు. లేదా ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుందా అనేది తెలియాల్సి ఉంది.విషయం తెలియగానే నార్సింగి పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. వారు హైదరాబాదులోని అమీన్‌పురకు చెందినవారుగా భావిస్తున్నారు. హత్యకోణంతో పాటు ఆర్థిక కారణాలతో ఏమైనా ఆత్మహత్య చేసుకున్నారా అనే కోణంలో దర్యాఫ్తు చేస్తున్నారు.నార్సింగి సీఐ మాట్లాడుతూ.. ఘటనాస్థలానికి క్లూస్ టీంను రప్పిస్తున్నట్లు చెప్పారు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో అక్కడకు వెళ్లామన్నారు. ఆత్మహత్య, హత్య కోణంలో దర్యాఫ్తు చేస్తున్నట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *