హైదరాబాద్‌లో యువతి అదృశ్యం

కొత్తపేట, హైదరాబాద్ ముచ్చట్లు:

నాగోల్‌లో ఓ యువతి అదృశ్యమైంది. పీ.స్వాతీరెడ్డి(29) నాగోల్‌ ఆదర్శనగర్‌లో ఉంటూ సిస్టమ్‌ అనలిస్టుగా పనిచేసేది. ఈ నెల 25న ఉదయం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లి తిరిగి రాలేదు. తెలిసిన వారు, స్నేహితుల వద్ద ఆచూకీ కోసం వెతికినా ఫలితం దక్కలేదని, మానసిక ఒత్తిడితో సోదరి ఎటో వెళ్లిపోయి ఉండొచ్చని సోదరుడు సురభి రాజా ఫల్గుణ రెడ్డి గురువారం ఎల్బీనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *