హైదరాబాద్‌లో విద్యార్థుల మధ్య గ్యాంగ్‌వార్.. రాళ్లతో దాడి

హైదరాబాద్ ముచ్చట్లు:

ఓ ప్రాంతంపై పట్టు కోసం లేదా ఆధిపత్యం కోసం గ్రూపుల మధ్య జరిగే గ్యాంగ్‌వార్ ఇప్పుడు విద్యార్థుల మధ్యకు పాకింది. విద్యార్థుల మధ్య జరిగే యుద్ధం వల్ల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. వనస్థలిపురం నారాయణ కాలేజీలో విద్యార్థుల మధ్య గ్యాంగ్‌వార్‌ జరిగింది. మల్లికార్జున్‌ అనే విద్యార్థిని బయటి వ్యక్తులతో తోటి విద్యార్థి కొట్టించారు. మల్లికార్జున్‌ తలపై రాళ్లతో దాడి చేయడంతో తీవ్రగాయాలయ్యాయి. దీంతో విద్యార్థిని ఆస్పత్రికి తరలించారు. నిక్‌ నేమ్‌తో పిలిచినందుకు మల్లికార్జున్‌పై దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.గతంలో మేడ్చల్ జిల్లాలో పేట్‌బషీర్‌బాగ్ పరిధిలోని మైసమ్మగూడలోని నర్సింహ ఇంజనీరింగ్ కాలేజీలో దారుణం జరిగింది.బీ.టెక్ ఫస్టియర్ విద్యార్థి భువనేశ్వర్‌పై కత్తులతో తోటి విద్యార్థులు దాడి చేసిన విషయం తెలిసిందే. అదే కాలేజీలో చదువుతున్న రోహిత్ అనే విద్యార్థి భువనేశ్వర్‌పై కట్టర్‌తో దాడి చేశాడు. ఒక్కసారిగా నివ్వెరపోయిన భువనేశ్వర్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. దాడిని అడ్డుకునేందుకు కొందరు విద్యార్థులు ప్రయత్నించి గాయపడ్డారు.మరికొందరు భయంతో పరుగులు తీశారు. ఇరువురికీ ఉన్న వాట్సప్ గ్రూప్ చాటింగ్‌లే దాడికి ప్రధాన కారణంగా బాధితులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *