హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ మరో ఘనత

హైదరాబాద్‌ ముచ్చట్లు:

హైదరాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు(ఆర్‌జీఐఏ)కు ప్రపంచస్థాయి నంబర్‌వన్‌ ర్యాంకు లభించింది. ఏడాదికి 5-15 మిలియన్ల ప్రయాణికుల క్యాటగిరీలో ప్రయాణికులకు అత్యుత్తమ సేవలందిస్తున్నందుకు గాను ఎయిర్‌పోర్ట్స్‌ కౌన్సిల్‌ ఇంటర్నేషనల్‌ సర్వీస్‌ క్వాలిటీ(ఏసీఐ) సంస్థ ఈ గుర్తింపు నిచ్చిందని విమానాశ్రయం యాజమాన్యం జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌(జీహెచ్‌ఐఏఎల్‌) ఒక ప్రకటనలో వెల్లడించింది.మారిషస్‌లో మంగళవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఏసీఐ డైరెక్టర్‌ జనరల్‌ అంజెలా గిటెన్స్‌ నుంచి ట్రోఫీ అందుకున్నట్లు జీహెచ్‌ఐఏఎల్‌ సీఈవో ఎస్‌జీకే కిశోర్‌ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *