1.16 లక్షల ఐటీ శాఖ నోటీసులు

దిల్లీ ముచ్చట్లు:
పెద్దనోట్ల రద్దు తర్వాత బ్యాంకు ఖాతాల్లో పెద్దఎత్తున నగదు జమచేసిన వారిపై ఆదాయపు పన్ను శాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా నోట్ల రద్దు తర్వాత బ్యాంకు ఖాతాల్లో రూ.25 లక్షలు, అంతకంటే ఎక్కువ మొత్తాలు జమ చేసిన 1.16 లక్షల వ్యక్తులు, కంపెనీలకు మంగళవారం నోటీసులు జారీ చేసింది. అంతేగాక పెద్ద మొత్తంలో డబ్బు జమ చేసిన వారి ఐటీ రిటర్నులను కూడా పరిశీలిస్తున్నట్లు కేంద్ర ప్రత్యక్ష పన్ను బోర్డు (సీబీడీటీ) ఛైర్మన్ సుశీల్ చంద్ర తెలిపారు.నోట్ల రద్దు తర్వాత పెద్ద మొత్తంలో డబ్బు జమ చేసి ఐటీ రిటర్న్లు దాఖలు చేయని వ్యక్తులు, సంస్థలను రెండు కేటగిరీలుగా విభజించారు.రూ.10-25లక్షలు జమ చేసినవారు, రూ.25 లక్షలు అంతకంటే ఎక్కువ మొత్తం జమ చేసిన వారి ఖాతాలను పరిశీలిస్తున్నారు. తొలి విడతలో భాగంగా రూ. 25లక్షలు అంతకంటే ఎక్కువ జమచేసి, రిటర్న్లు దాఖలు చేయని వ్యక్తులు, సంస్థలకు తాజాగా నోటీసులు జారీ చేశారు.’రూ. 25లక్షలు, అంతకంటే ఎక్కువ మొత్తంలో జమ చేసి రిటర్న్లు దాఖలు చేయని వారు 1.16 లక్షలు ఉన్నారు. వారికి నోటీసులు జారీ చేశాం. 30 రోజుల్లోగా వారిని రిటర్న్లు దాఖలు చేయాలని సూచించాం’ అని చంద్ర తెలిపారు. రూ.10-25 లక్షలు జమ చేసి రిటర్న్లు దాఖలు చేయనివారు 2.4 లక్షల మంది ఉన్నారని చెప్పారు. రెండో విడతలో వారికి కూడా నోటీసులు జారీ చేస్తామన్నారు.
Tag : 1.16 lakh IT department notices


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *