10 lakhs to the Murali family

 మురళి కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థికసాయం

Date: 09/12/2017
సిద్దిపేట ముచ్చట్లు:
ఇటీవల ఓయూలో ఆత్మహత్య చేసుకున్న మురళి కుటుంబాన్ని మంత్రి హరీశ్రావు పరామర్శించారు. మురళి కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థికసాయాన్ని అందజేశారు. ప్రభుత్వ ఉద్యోగం రావడంలేదన్న బాధతో ఉస్మానియా యూనివర్సిటీలో ఎమ్మెస్సీ ఫిజిక్స్ ప్రథమ సంవత్సరం చదువుతున్న మురళీ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఓయూలో మానేరు హాస్టల్ బాత్రూమ్లోనే ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం దౌలాపూర్ గ్రామానికి చెందిన మురళి.. ఓయూలో సీటు పొందిన తరువాత మానేరు హాస్టల్లోని రూమ్ నంబరు 159లో ఉంటూ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాడు.
Tag: 10 lakhs to the Murali family

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *