తెలుగు రాష్ట్రాలకు రైల్వేలకు 10 వేల 80 కోట్లు

న్యూఢిల్లీ ముచ్చట్లు:
 
రైల్వే బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలకు రూ.10,080 కోట్లు కేటాయించిందని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజీవ్ కిషోర్ తెలిపారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి రూ.7,032 కోట్లు, తెలంగాణ రాష్ట్రానికి రూ.3,048 కోట్ల కేటాయింపులు జరిగాయని వెల్లడించారు. 2022-23 బడ్జెట్‌లో గతంతో పోలిస్తే 30 శాతం కేటాయింపులు పెరిగాయన్నారు. 2021-22 బడ్జెట్‌లో రూ.7,049 కోట్ల కేటాయింపు జరిగాయని తెలిపారు.ఈ ఏడాది డబ్లింగ్, థర్డ్ లైన్, బై పాస్‌ల కోసం రూ.5,517 కోట్లు కేటాయించగా.. గత ఏడాది రూ.4,238 కోట్లు మాత్రమే కేటాయించిందని వివరించారు. కొత్త లైన్ల కోసం ఈ ఏడాది రూ.2,817 కోట్లు కేటాయించగా.. గత ఏడాది రూ.2,195 కోట్లు కేటాయించిందన్నారు. విద్యుద్దీకరణ కోసం ఈ ఏడాది రూ.791 కోట్లు కేటాయించగా… గత ఏడాది రూ.617 కోట్లు కేటాయించినట్లు స్పష్టం చేశారు.నడికుడి-శ్రీకాళహస్తి కొత్త లైన్ రూ.1,051 కోట్లు, కడప-బెంగళూరు కొత్త లైన్ రూ.289 కోట్లు, కోటిపల్లి-నర్సాపూర్ కొత్త లైన్ రూ.358 కోట్లు, మునీరాబాద్-మహబూబ్‌నగర్ కొత్త లైన్ రూ.289 కోట్లు, భద్రాచలం-సత్తుపల్లి కొత్త లైన్ కోసం రూ.163 కోట్లు, మనోహరాబాద్-కొత్తపల్లి కొత్త లైన్ కోసం రూ.160 కోట్లు, అక్కన్నపేట-మెదక్ కొత్త లైన్ కోసం రూ.41 కోట్లు, విజయవాడ-గుడివాడ, మచిలీపట్నం- భీమవరం, నర్సాపూర్- నిడదవోలు డబ్లింగ్, విద్యుద్ధీకరణ కోసం రూ.1,681 కోట్లు, విజయవాడ-గూడూరు 3వ లైన్ కోసం రూ.1000 కోట్లు కేటాయించింది.గుంటూరు-గుంతకల్ డబ్లింగ్ పనుల కోసం రూ.803 కోట్లు, కాజీపేట-విజయవాడ థర్డ్ లైన్ కోసం రూ.592.5 కోట్లు, కాజీపేట-బలార్షా మూడో లైన్ కోసం రూ.550.43 కోట్లు, సికింద్రాబాద్- మహబూబ్‌నగర్ డబ్లింగ్, విద్యుద్ధీకరణ కోసం రూ.150 కోట్లు, గుత్తి-ధర్మవరం డబ్లింగ్ కోసం రూ.100 కోట్లు, అకోలా-డోన్ డబ్లింగ్ కోసం రూ.5 కోట్లు, బైపాస్ లైన్ల కోసం రూ.407 కోట్లు, మన్మాడ్-డోన్ విద్యుద్దీకరణ కోసం రూ.229 కోట్లు, ధర్మవరం-పాకాల విద్యుద్దీకరణ కోసం రూ.131 కోట్లు, పార్లీ- వైజనాథ్-వికారాబాద్ విద్యుద్దీకరణ కోసం రూ.109 కోట్లు, పూర్ణ-అకోలా విద్యుద్దీకరణ కోసం రూ.103 కోట్లు, నంద్యాల-ఎర్రగుంట్ల విద్యుద్దీకరణ కోసం రూ.51 కోట్లు, లింగంపేట-జగిత్యాల-నిజామాబాద్ విద్యుద్దీకరణ కోసం రూ.39 కోట్లు కేటాయించింది. అటు రైల్వేస్టేషన్‌ల అభివృద్ధి కోసం రూ.325 కోట్లు కేటాయించగా… చర్లపల్లి శాటిలైట్ టర్మినల్ కోసం రూ.70 కోట్లు, కర్నూలులో మెడిలైఫ్ రిహాబిలిటేషన్ ఫ్యాక్టరీ కోసం రూ.58 కోట్లు, తిరుపతి రైల్వేస్టేషన్‌లో సౌత్ సైడ్ ఎంట్రీ కోసం రూ.3 కోట్ల నిధులను రైల్వేశాఖ కేటాయించింది.
 
Tags: 10 thousand 80 crores for railways for Telugu states

Natyam ad