కోడెలకు 100మంది ఎమ్మెల్యేల లీవ్ లెటర్స్!

హైదరాబాద్‌ ముచ్చట్లు:
ఏపీ లో ఈ మధ్య అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ మధ్య మాటల యుద్దాలు అంతగా చోటుచేసుకోవడం లేదు. ఇక ఏపీ అసెంబ్లీ సమావేశాలు కూడా అంతంత మాత్రంగానే సైలెంట్ గా సాగుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్యేలు ఆ సమావేశాలకు రామని చెప్పిన సంగతి తెలిసిందే.జగన్ కూడా పాదయాత్రతో చాలా బిజీగా ఉండడంతో పార్టీ నేతలు ఎవ్వరు సమావేశాలకు రావడం లేదు. అయితే ప్రస్తుతం అసెంబ్లి సమావేశాలకు హాజరవుతోన్న వారు కూడా ఓ నాలుగు రోజుల వరకు రాలేని పరిస్థితి అని తెలుస్తోంది. రీసెంట్ గా స్పీకర్ ని సెలవలు కోరడంతో ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. ఓ పది మందికి ఇచ్చారు అంటే ఒకే కానీ ఒకే సారి 100 మంది ఎమ్మెల్యేలకు సెలవులు ఇచ్చేశారు. ఏపీ రాజకీయాల్లో ఈ తరహా ఘటన ఎప్పుడు చోటు చేసుకోలేదు.అందులో ఎక్కువ మంది అధికార పార్టీ నాయకులే ఉన్నారని తెలుస్తోంది. ఈ నాలుగు రోజులు వివాహాలు ఎక్కువగా ఉండడంతో నాయకులు తప్పనిసరిగా
హాజరు కావాల్సిన పెళ్లిళ్లు అని సెలవులు తీసుకున్నారట.
Tag: 100 MLAs leave letters for posters

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *