102 KCR to launch service vehicles

102 సర్వీస్‌ వెహికల్స్‌ను ప్రారంభించిన కేసీఆర్‌

Date: 17/01/2018

హైదరాబాద్ ముచట్లు:

నగరంలోని పీపుల్స్ ప్లాజాలో 102 సర్వీస్ వెహికల్స్‌ను ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… గర్భిణిల ప్రసవ సమయంలో ఆస్పత్రులకు, ప్రసవం తర్వాత ఇంటికి చేర్చేందుకు 102 వాహనాలను ఉపయోగించవచ్చన్నారు. అలాగే అత్యవసర సమయంలో మారుమూల ప్రాంతాలకు వెళ్లేందుకు యాభై 108 బైక్‌ అంబులెన్స్‌లు ప్రారంభించామన్నారు. కాగా… రెండు వందల 102 సర్వీస్‌ వాహనాల్లో జీపీఎస్‌ టెక్నాలజీని ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, వైద్యఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌లతోపాటు పలువురు పాల్గొన్నారు.

Tags: 102 KCR to launch service vehicles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *