పార్కులో అర్ధనగ్నంగా యువతి మృతదేహం

నోయిడా ముచ్చట్లు :

తెల్లవారు జామున కొందరు వ్యక్తులు ఓ పార్కుకు వాకింగ్కు వెళ్లారు. అక్కడ వారికి కనిపించింది చూసి నిద్రమత్తు ఎగిరిపోయింది. ఓ యువతి మృతదేహం అర్ధనగ్నంగా వారి కంటికి కనిపించింది. వెంటనే వారు ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు తెలియజేశారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్మార్టమ్ కోసం ఆసుపత్రికి తరలించారు. గ్రేటర్ నోయిడా సెక్టార్ 22 పరిధిలోని ఓ పార్కులో ఈ మృతదేహం లభ్యమైంది. మహిళ మెడలో మంగళ సూత్రం ఉంది. దీనితోపాటు చేతిపై రేఖ అని రాసి ఉండటాన్ని పోలీసులు గమనించారు. వివాహితపై గుర్తుతెలియని వ్యక్తులు అత్యాచారం చేసి ఉంటారని, ఆ తరువాత కొట్టి చంపి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించి పోలీసు జాగిలాలను రప్పించి కేసు దర్యాప్తు ఆరంభించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *