12 గంటలు.. 4 రైలు ప్రమాదాలు

దిల్లీ ముచ్చట్లు:
కేవలం 12 గంటల్లోనే దేశంలో నాలుగు రైలు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. వీటిలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో 11 మంది గాయపడ్డారు. కాగా.. నాలుగింటిలో మూడు ప్రమాదాలు ఉత్తర్ప్రదేశ్లోనే జరగడం గమనార్హం.గురువారం రాత్రి 7 గంటల నుంచి శుక్రవారం ఉదయం 7 గంటల మధ్య ఈ ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. గురువారం ఉత్తర్ప్రదేశ్లోని అమేథీలో లోకల్ రైలు బొలెరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతిచెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. రైల్వే క్రాసింగ్ వద్ద సిబ్బంది లేకపోవడంతో ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు.ఇక శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో యూపీలోని చిత్రకూట్ జిల్లాలో రైలు పట్టాలు తప్పింది.పట్నా వెళ్తున్న వాస్కోడిగామా-పట్నా ఎక్స్ప్రెస్ రైలు మానిక్పూర్ రైల్వేస్టేషన్ నుంచి బయల్దేరిన కొద్దిసేపటికే 13 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో ఇద్దరు తండ్రీకొడుకులు సహా ముగ్గురు మృతిచెందగా.. మరో తొమ్మిది మంది గాయపడ్డారు.ఇక ఈ ప్రమాదం జరిగి రెండు గంటలైనా గడవకముందే ఒడిశాలో మరో ఘటన చోటుచేసుకుంది. ఉదయం 6 గంటల ప్రాంతంలో పరదీప్-కటక్గూడ్స్ రైలు గోరఖ్నాథ్-రఘునాథ్పూర్ మధ్య ప్రమాదానికి గురైంది. 14 బోగీలు పట్టాలు తప్పాయి. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు. ఇదిలా ఉండగా శుక్రవారం తెల్లవారుజామున యూపీలోని సహరాన్పూర్ ప్రాంతంలో మరో రైలు ప్రమాదం జరిగింది. ఈ ఉదయం 2.30 గంటల ప్రాంతంలో జమ్ము-పట్నా అర్చన ఎక్స్ప్రెస్ ఇంజిన్ బోగీల నుంచి విడిపోయింది. అయితే గుర్తించిన అధికారులు వెంటనే స్పందించి ఇంజిన్ను బోగీలతో కలిపారు. వరుస ఘటనలపై రైల్వే శాఖ స్పందించింది. విచారణకు ఆదేశించినట్లు రైల్వే మంత్రి పియూష్ గోయల్ తెలిపారు.
Tag : 12 hours .. 4 train accidents


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *