స్పందన కు  15 వినతులు

– నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్
 
 
నంద్యాల ముచ్చట్లు:
 
స్పందన కార్యక్రమానికి 15 వినతులు అందినాయి అని నంద్యాల సబ్ కలెక్టర్  చాహత్ బాజ్ పాయ్ అన్నారు.
సోమవారం నంద్యాల సబ్ కలెక్టర్ కార్యాలయం లో స్పందన కార్యక్రమము నిర్వహించారు. ఈకార్యక్రమం లో నంద్యాల సబ్ కలెక్టర్  చాహత్ బాజ్ పాయ్. కోవిడ్ నిబంధనలు పాటించుచు  వినతిదారుల నుండి వినతులు స్వీకరించారు.అనంతరం సబ్ కలెక్టర్  చాహత్ బాజ్ పాయ్ మాట్లాడుతూ స్పందన  కార్యక్రమంలో విన్నవించే విన్న తులలో విన్నతి దారుల ఆధార్ కార్డు నెంబరు మరియు సెల్ ఫోన్ నెంబర్లు ఖచ్చితంగా నమోదు చేయాలి అని అన్నారు. కరోనా వైరస్‌ ఒమిక్రాన్‌ వేరియంట్‌ విస్తరిస్తున్న నేపథ్యంలో  కోవిడ్-19 నిబంధనలను ప్రజలంతా ఖచ్చితంగా పాటించాలని   విజ్ఞప్తి చేశారు..సామాజిక దూరం పాటించడంతో పాటు, తరచుగా చేతులను శుభ్రపరచుకోవడం, బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ తప్పనిసరిగా ధరించాలని కోరారు.బహిరంగ ప్రదేశాల్లో మాస్కు ధరించని వారికి రూ.100 జరిమానా . వాణిజ్య, వ్యాపార సంస్థలు, దుకాణాల్లో మాస్కులు ధరించని వారిని అనుమతించకూడదన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే దుకాణాలు, వాణిజ్య ప్రదేశాలకు రూ.10 వేల నుండి 25 వేల వరకు  జరిమానా విధించాలని స్పష్టం చేశారు..సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంలో కోవిడ్ నిబంధనలు పాటించుతూ వినతిదారుల నుండి వినతులు స్వీకరించినామని అన్నారు.  వినతి దారులకు ముఖ్యంగా తెలియజేయడమేమనగా మీ పరిధిలోని సచివాలయం నందు మరియు మండల తహశీల్దార్ వారి కార్యాలయం నందు కూడా వినతులు స్వీకరించబడతాయి అక్కడ పరిష్కారం దొరకనప్పుడు మాత్రమే డివిజన్ లోని  సబ్ కలెక్టర్ కార్యాలయం నకు  రావాలన్నారు .సోమవారం జరిగిన స్పందన కార్యక్రమానికి ఎక్కువ శాతం భూ తగాదాల గురించి. భూములను ఆన్లైన్లో నమోదు చేయించాలని.  భూములను ఆక్రమించుకున్నారని.  భూములను కొలతలు వేయించి అడంగల్ నందు భూముల  వివరాలు నమోదు చేయాలని. మేము చేనేత కార్మికులము మాకు బట్టల తయారీ రా మెటీరియల్  ధరలను అదుపు చేయాలని .తదితర వినతులు  అందినాయి అన్నారు. సోమవారం జరిగిన స్పందన కార్యక్రమాని కి 15 వినతులు  అందినాయని  అన్నారు.
 
 
 
బండి ఆత్మకూరు మండల కేంద్రంలోని చిన్న లింగన్న. చిన్న పుల్లన్న మా తండ్రి బంగారిగల. పుల్లన్న. మా తండ్రి కష్టార్జితం బండి ఆత్మకూరు గ్రామ పొలిమేరలో సర్వే నంబర్ 522 లో  మూడు ఎకరాలు కలదు ఆ స్థిరాస్తి కి మేమే వారసులం కానీ మాకు ఇంత వరకు పాస్ పుస్తకాలు ఇవ్వలేదు  పాస్ పుస్తకాలు ఇప్పించాలని  కోరి ఉన్నారని తెలిపారు.నంద్యాల మండలం మూలసాగరం గ్రామం మినిగే .రాములమ్మ. మూలసాగరం గ్రామ పొలిమేరలో  సర్వేనెంబర్ 298/3 లో ఒక ఎకరా డెబ్భై ఐదు సెంట్ల భూమి కలదు మాకు  పాస్ పుస్తకాలు ఇవ్వడం లేదు దయతో పాస్ పుస్తకాలు ఇప్పించాలని కోరారు. నంద్యాల మండలం కానాల గ్రామ ప్రజలు కానాల గ్రామంలో  మండల ప్రజా పరిషత్ పాఠశాల ప్రధాన రహదారి  ప్రక్కన ఉన్నందున తరచుగా ప్రమాదాలకు విద్యార్థులు గురి అవుతున్నారు కావున ప్రధాన రహదారికి స్పీడ్ బ్రేకర్లు వేయించాలని కోరినారు.
ఈ కార్యక్రమంలో . సబ్ కలెక్టర్ కార్యాలయం తహసిల్దార్ మహమ్మద్ రఫీ.  సబ్ కలెక్టర్ కార్యాలయం   డిప్యూటీ తహసీల్దార్ ఫక్కీర్ హమ్మద్ .తదితర అధికారులు పాల్గొన్నారు.
 
Tags: 15 requests for response

Natyam ad