189 fake tickets at Mumbai devotees

189 మంది ముంబై భక్తుల వద్ద నకిలి టిక్కెట్లు

Date : 06/12/2017
తిరుమల ముచ్చట్లు:
తిరుమలలో నకిలీ ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలకలం రేపుతున్నాయి. ఆన్లైన్ నకిలి టిక్కెట్ల దందాను టీటీడీ విజిలెన్స్ సిబ్బంది బట్టబయలు చేశారు. బుధవారం మధ్యాహ్నం శ్రీవారి దర్శనార్థం ముంబైకి చెందిన 190 మంది భక్తులు ప్రత్యేక ప్రవేశం టిక్కెట్లు ఆన్లైన్లో పొందారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ప్రత్యేక ప్రవేశం వద్దకు చేరుకున్నారు. 190 మందిలో ఒక భక్తురాలి టిక్కెట్టు ఒరిజనల్ అని, మిగిలిన టిక్కెట్లు నకిలీవని అధికారులు తేల్చారు. వారిలో కొంతమందిని టీటీడీ విజిలెన్స్ సిబ్బంది అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Tags : 189 fake tickets at Mumbai devotees

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *