2 న వైసీపీ విద్యార్థి విభాగం తిరుమల పాదయాత్ర

పలమనేరు ముచ్చట్లు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నవంబర్ 2 వ తేదీన తిరుమలకు పాదయాత్ర చేస్తామని పట్టణ విద్యార్థి విభాగం అధ్యక్షుడు క్రిష్ణప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం నాడు ఆయన విద్యార్థులతో కలసి పట్టణ సమీపంలోని మొగిలి ఘాట్ లో వెలసిన అభయహస్త ఆంజనేయస్వామికి పూజలు నిర్వహించి ఆలయం ముందు 116 కొబ్బరి కాయలు కట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి నవంబర్ 6 న ప్రారంభించనున్న జన సంకల్ప పాదయాత్ర విజయవంతంగా పూర్తి చేయాలని తాము తిరుమలకు అలిపిరి శ్రీవారి పాదాల నుంచి పాదయాత్ర గా వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటామని తెలిపారు. తాము ఈ పాదయాత్రని రాజంపేట పార్లమెంటు సభ్యుడు మిథున్ రెడ్డి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్ రెడ్డి ల ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నామని చెప్పారు. విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *