20 శాతం మందే లెక్కలు చేస్తున్నారు

Date:13/02/2018
హైదరాబాద్‌ ముచ్చట్లు:
ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో భాగహారాలు చేయగలిగిన విద్యార్థులు 20 శాతం మించి లేరు. వాస్తవానికి గణితంలో గుణకార, భాగహారాలతో కూడిన రాత లెక్కలు చేయగలగాలి. కానీ ఎక్కడా రాతలెక్కల గురించి కూడికలతో మొదలుకుని గుణకారాల గురించి అభ్యాసం కల్పించలేదు’ రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ జనవరి 3 నుంచి 9వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ బడులను తనిఖీ చేసి, విద్యార్థులను పరీక్షించి ఇచ్చి న నివేదిక ఇది. సర్కారు బడుల్లో ప్రాథమిక స్థాయి లో ఎక్కువ పాఠశాలల్లో గణితంలో తీసివేతల వర కు, కొన్ని పాఠశాలల్లో గుణకారాల వరకు అభ్యా సం కల్పించారు. గణితంలో నూతన సమస్యలు రాయడంలో పిల్లలకు ఉపాధ్యాయులు సరైన అవగాహన కల్పించడం లేదు. ఉపాధ్యాయులు గణితంలో సంఖ్యలతో కూడిన లెక్కలను బోర్డుపై రాసి చేయమంటున్నారే కానీ, రాత లెక్కలపై అభ్యాసం కల్పించడం లేదని నివేదించారు. పాఠశాలల్లో గణాంకాలకు వాస్తవ ప్రగతికి మధ్య చాలా వ్యత్యాసం ఉంద ని తనిఖీల్లో తేలింది. తెలుగు, ఇంగ్లీష్‌లలో పిల్లలకు యాంత్రికంగా అభ్యాసం కల్పించారని, కరదీపికలో వివరించిన తీరులో అభ్యాసాలతో కూడిన కృత్యాలను కల్పించిన టీచర్లు అరుదు అని నివేదిక పేర్కొనింది.ప్రాథమిక, ఉన్నత స్థాయిల్లో ఆంగ్లంలో దాదాపు అందరూ అక్షరాలను గు ర్తించగలుగుతున్నా పిల్లలు పదాలను చదవలేకపోతున్నారు. ఇంగ్లీష్‌లో ఒక పేరాను ధారాళంగా చదవగలిగే, తప్పులేకుండా రాయగలిగే విద్యార్థులు ప్రాథమిక స్థాయిలో ఎవరూ లేరని నివేదికలో పేర్కొన్నారు. ఉన్నత స్థా యిలో 15 శాతం వరకు ఉంటారని తెలిపింది. ఆదర్శ పాఠశాలల్లో పరిస్థితి కొంత మెరుగుగా ఉన్నా కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాలు (కెజిబివి)లలో పరిస్థితి ఉన్నత పాఠశాలల మాదిరిగానే ఉందని తనిఖీల్లో వెల్లడైంది. గ్రంథాలయ పుస్తకాలు, వార్తాపత్రికలు, బాలసాహిత్యం, కథావాచకాలు, అక్షరాలు, పదాలు, సంఖ్యలు తదితర వాటికి చెందిన బోధనాభ్యాసన సామాగ్రి ఎక్కడా ఉపయోగించిన ఆధారాలు లేవని నివేదికలో పేర్కొన్నారు. ప్రాథమిక స్థాయిలో ఫార్మెటివ్ అసెస్‌మెంట్(ఎఫ్‌ఎ)ల నిర్వహణపై పూర్తి స్థాయిలో అవగాహనే లేదు. ప్రైమరీ స్కూళ్లలో పిల్లల నోట్‌బుక్‌లు కూడా సరిగ్గా ఉండటం లేదు.రాత పనులకు, ప్రాజెక్ట్ పనులకు, పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనల కు టీచర్లు మౌఖికంగానే మార్కులు వేస్తున్నారు. కొన్ని చోట్ల ఎఫ్‌ఎ నిర్వహించకుండానే మార్కులు నమోదు చేసినప్పటికీ వాటిని పరిశీలించలేదు. వివిధ పాఠశాలల్లో ఎఫ్‌ఎల నిర్వహ ణ గురించి అవగాహన అంతంత మాత్రంగానే ఉందని నివేదించారు. మండల విద్యాధికారులు, డిప్యూటీ ఐఒఎస్‌లు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు పాఠశాలలను పర్యవేక్షిస్తున్నటికీ రికార్డులను పరిశీలించి, ప్రశ్నించిన దాఖలాలు లేవు. కేవలం సిసిఇ రిజిష్టర్‌లో వివరాలు నమోదు చేశారా..? లేదా..? అని అడగడానికే పరిమితమయ్యారు. పాఠశాలల నుంచి నివేదికలు వస్తే చాలా అనే ధోరణిలో ఎంఇఒలు, డిప్యూటీ ఐఒఎస్‌లు వ్యవహరిస్తున్నారు. వీరికి కూడా ప్రాథమిక స్థాయిలో సిసిఇ నిర్వహణపై అంతంత మాత్రంగానే అవగాహన ఉందని తేలింది.
Tags: 20 per cent is calculated

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *