24 Kisses Sensor Complete .. Release on October 26th ..

24 కిస్సెస్ సెన్సార్ పూర్తి.. అక్టోబ‌ర్ 26న విడుద‌ల‌.. 

Date:09/10/2018
24 కిస్సెస్ సినిమా సెన్సార్ కార్యక్ర‌మాలు పూర్త‌య్యాయి. ‘A’ స‌ర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. అక్టోబ‌ర్ 26న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు నిర్మాత‌లు. ఆదిత్ అరుణ్, హెబ్బాప‌టేల్ జంట‌గా న‌టిస్తున్న 24 కిస్సెస్ చిత్రాన్ని తొలి సినిమాతోనే ప్రశంస‌లు అందుకున్న ద‌ర్శ‌కుడు అయోధ్య కుమార్ తెర‌కెక్కిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ చిత్ర ట్రైల‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. బోల్డ్ కంటెంట్ కు తోడు అద్భుత‌మైన క‌థ‌తో ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్నారు ద‌ర్శ‌కుడు అయోధ్య‌కుమార్. హెబ్బా, ఆదిత్ మ‌ధ్య కెమిస్ట్రీ ఈ చిత్రానికి హైలైట్ కానుంది. అలాగే అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌క‌ల‌ను ఈ చిత్రం క‌చ్చితంగా అల‌రిస్తుంద‌ని చెబుతున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. రావు ర‌మేష్, న‌రేష్ ఈ చిత్రంలో కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. జోయ్ బ‌రువా సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి వివేక్ ఫిలిప్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందించారు. ఉద‌య్ గుర్రాల సినిమాటోగ్ర‌ఫ‌ర్ గా ప‌నిచేసారు.  న‌టీన‌టులు: ఆదిత్ అరుణ్, హెబ్బాప‌టేల్, న‌రేష్, రావు ర‌మేష్, అదితి మైఖెల్, శ్రీ‌ని కాపా, మ‌ధు నెక్కంటి.
Tags:24 Kisses Sensor Complete .. Release on October 26th ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *