25 ఏళ్ల తర్వాత పవన్‌ తో లిజీ

తార లిజీ దాదాపు 25 ఏళ్ల తర్వాత మళ్లీ కెమెరా ముందుకు రాబోతున్నారు. పవన్‌కల్యాణ్‌, దర్శకుడు త్రివిక్రమ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న నితిన్‌ చిత్రంలో లిజీ కీలక పాత్రలో నటించనున్నారు. ఈ విషయాన్ని లిజీ ఫేస్‌బుక్‌ ద్వారా వెల్లడించారు

అమెరికాలో సినిమా తొలి షెడ్యూల్‌ను పూర్తిచేశాం. రెండో షెడ్యూల్‌ కునూర్‌లో చేయనున్నాం. 2018లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నటనకు స్వస్తి చెప్పకముందు తెలుగులో ఎనిమిది సినిమాలు చేశాను. అందులో ఆరు సూపర్‌ హిట్టయ్యాయి. వాటిలో ‘మగాడు’, ‘20వ శతాబ్దం’ సినిమాలు ఉన్నాయి.

నేను నా సొంత స్టూడియో పనులు కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఏడాదికి ఒకటి, రెండు సినిమాలు చేస్తాం. అది కూడా పాత్ర ఆసక్తికరంగా ఉంటేనే. 22 ఏళ్ల వయసులో నాకు అవకాశాలు వస్తున్న సమయంలో చిత్ర పరిశ్రమను వదులుకోవడం నేను సరిదిద్దుకోలేని తప్పు. ఆ క్షణాలను మళ్లీ తీసుకురాలేను. కాబట్టి సెకండ్‌ ఇన్నింగ్స్‌లోనైనా మంచి పాత్రలు చేయాలని ఆశిస్తున్నాను. మీరంతా సపోర్ట్‌ చేసినందుకు ధన్యవాదాలు’ అని లిజీ తన ఫేస్‌బుక్‌ పోస్ట్‌లో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *