25 న బిజెపి యువ చైతన్య సదస్సు

పలమనేరు ముచ్చట్లు

భారతీయ జనతా పార్టీ ఆద్వర్యంలో ఈ నెల 25 న తిరుపతి లోని ఎల్ వి కళ్యాణ మండపం నందు నవభారత యువ చైతన్య మహా సభ నిర్వహిస్తామని భారత జనతా పార్టీ యువ మోర్చా జిల్లా కార్యదర్శి జల్లి హరికృష్ణ తెలిపారు. యువత అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు. ఆదివారం పెద్ద పంజాణి మండలంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బిజెవైయం జిల్లా అధ్యక్షుడు లోకేష్ మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ యువత అభివృద్ధి కోసం అనేక పథకాలు ప్రవేశ పెట్టారన్నారు.దేశ సేవకోసం యువత ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమం లో మండల నాయకులు వెంకటేష్, కిషోర్, విక్రమ్, కృష్ణ, యువరాజ్, శివ, రెడ్డి బాల, శంకరయ్య లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *