26 వేల కోట్ల  విశాఖ రిఫైనరీ

న్యూఢిల్లీ ముచ్చట్లు:
 
విశాఖలోని రిఫైనరీ ప్రాజెక్టును రూ.26,264 కోట్లతో ఆధునీకరించి విస్తరణ చేపట్టాలని నిర్ణయించినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. సోమవారం రాజ్యసభలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి రామేశ్వర్ ఈ విషయాన్ని తెలియజేశారు. ఇందుకు హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) అంగీకారం తెలిపిందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమం పూర్తయితే రిఫైనరీ సామర్థ్యం ప్రస్తుతం ఉన్న 8.3 మిలియన్ మెట్రిక్ టన్నుల నుంచి 15 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేరుతుందన్నారు.ఈ ప్రాజెక్టు వల్ల బహుళ ప్రయోజనాలు చేకూరతాయని, విశాఖ రిఫైనరీ ఆధునీకరణ కోసం స్థానిక ఉత్పత్తులనే ఉపయోగిస్తామని కేంద్రమంత్రి రామేశ్వర్ వెల్లడించారు. కాగా హెచ్‌పీసీఎల్ చరిత్రలో ఈ స్థాయిలో ఆధునీకరణ, విస్తరణ పనులు చేపట్టడం ఇదే తొలిసారి అని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు వెల్లడించారు. దీంతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా లక్షల మందికి జీవనోపాధి కలుగుతుందన్నారు. అంతేకాకుండా రాష్ట్రాభివృద్ధికి, పన్నుల రూపంలో ఆదాయానికి ఈ ప్రాజెక్ట్ తోడ్పడుతుందని జీవీఎల్ వెల్లడించారు.
 
Tags: 26,000 crore Visakhapatnam refinery

Natyam ad