29న వైశ్యరత్న ఎస్‌పి.మునస్వామిశెట్టి సంస్మరణ సభ

పుంగనూరు ముచ్చట్లు

వైశ్య రత్న బిరుదాంకితుడు ఎస్‌పి.మునస్వామిశెట్టి సంస్మరణ సభ ఈనెల 29న ఆర్యవైశ్య భవన్‌లో నిర్వహిస్తున్నట్లు సంఘ నూతన అధ్యక్షుడు ముల్లంగి విజయ్‌కుమార్‌ తెలిపారు. గత 50 సంవత్సరాలుగా ఆర్యవైశ్య సంఘంతో పాటు పట్టణంలోని ఆలయాలు, కళ్యాణ మండపాలు, పాఠశాలలు, కళాశాలల అభివృద్ధికి పలు సేవలు అందించి, అనంతలోకాలకు వెళ్లిపోయిన మునస్వామిశెట్టి సేవలను స్మరిస్తూ సభను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు హాజరై, దివంగత మునస్వామిశెట్టికి ఘన నివాళులర్పించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *