29 న చలో గరగపర్రు కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. ఎన్ని అడ్డంకులెదురైనా అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు ఆపలేరు

పలమనేరు ముచ్చట్లు

అఖిలభారత దళిత హక్కుల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు కందుల ఆనందరావు ఆదేశాల మేరకు ఈ నెల 29 ఆదివారం నాడు గరగపర్రు లో నిర్వహించనున్న చలో గరగపర్రు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి( state working general Secretary) యరబల్లి శ్రీనివాసులు పిలుపునిచ్చారు.సోమవారం పలమనేరు పట్టణలోని ఆర్ అండ్ బి అతిది గృహంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దళిత, బహుజనులపై అగ్రవర్ణాల దాడులు, సామాజిక బహిష్కరణలకు నిరసనగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు తెలిపారు.తొలుత చలో గరగపర్రు గోడపత్రికను ఆవిష్కరించారు‌.గరగపర్రు లో డా.బి.ఆర్.అంబేద్కర్ విగ్రహాన్ని అగ్రవర్ణాల వారు ద్వంసం చేసిన విషయం తెలిసిందే. ఇందుకు నిరసనగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే స్వంత ఖర్చులతో తమ దేవుడు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి తీరుతామన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కొత్త సుధాకర్, ఉపాధ్యక్షుడు కనం చిన్న, నాయకులు వెంకటేష్, మధు, వాసు,బాల తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *