కమల మొక్కలకు 300 కమలాలు

కాకినాడ ముచ్చట్లు:
 
తూర్పు గోదావరి జిల్లా కడియంలోని ప్రముఖ నర్సరీలో ఓ క్రేజీ సీన్ కనిపించింది. ఆకులు కూడా కనిపించకుండా కాయలతో నిండుగా ఉన్న కమలా మొక్కలు నర్సరీలో సందడి చేస్తున్నాయి. విదేశాల్లోనే ఉండే ఈ మొక్కలు రెండు రోజుల క్రితం ఇక్కడకు చేరుకున్నాయి. చెట్టుపై నుంచి కింద వరకు కాయలతోనే నిండి ఉన్నాయి. రవాణా ఖర్చులు కలిపి ఇక్కడకు రావడానికి ఒక్కొక్క మొక్కకు దాదాపు 20 వేలు ఖర్చు అయిందట. అలాగని వీటిని అమ్మడానికి ప్రత్యేకంగా తీసుకొచ్చింది కాదు. ఈనెల 22వ తేదీ నుంచి మూడు రోజుల పాటు రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో జరగాల్సిన నర్సరీ మేళాలో ప్రత్యేక ఆకర్షణంగా ఉండేందుకు ఈ నాలుగు మొక్కలను బుక్ చేసుకున్నారు నర్సరీ యజమాని. అయితే కోవిడ్ కారణంగా అధికారులు అనుమతి ఇవ్వకపొవడంతో నర్సరీ మేళా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అలాగే ఈ మొక్కలు వేరే దేశం నుండి ఓడలో రావడం కూడా జాప్యం జరిగి రెండు రోజుల క్రితమే ఇక్కడకు చేరుకున్నాయి. ఈ అరుదైన మొక్కలు మన దేశానికి రావడం ఇదే ప్రథమమని తెలుస్తుంది. అయితే ఈ మొక్కలు తీసుకొచ్చిన రైతు పేరు చెప్పడానికి ఇష్టపడటం లేదు. అదేమని అడిగితే ఈ కాయలు ఎక్కడో కాచినవని.. వచ్చే సీజన్‌లో తన నర్సరీలో ఇదే విధంగా కాపు కాయించి తన నర్సరీ ప్రత్యేకతను తెలియజేస్తామని ఆ రైతు ధీమా వ్యక్తం చేశారు.
గుండెపోటుతో నిరుద్యోగి మృతి
Tags: 300 oranges for lotus plants

Natyam ad