4 నుంచి 17 వరకు ఏపీ అసెంబ్లీ

విజయవాడ ముచ్చట్లు:
 
ఏపీలో మార్చి తొలివారంలో బడ్జెట్ సమావేశాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్చి 4 లేదా 7న బడ్జెట్ సమావేశాలను ప్రారంభించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ విషయంపై త్వరలోనే స్పష్టత రానుంది. ఈ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే కొత్త రాజధాని ఏర్పాటు, కొత్త జిల్లాలపై ప్రత్యేక బిల్లులను ప్రభుత్వం తీసుకురానున్నట్లు సమాచారం. ఉగాది నుంచి కొత్త జిల్లాలలో పరిపాలనను అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్న తరుణంలో.. ఉగాదికి ఇంకా రెండు నెలల సమయం ఉండటంతో ఈలోపు అసెంబ్లీ, శాసనమండలి బడ్జెట్ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టి, ఆమోదింపజేసుకోవడంపై జగన్ ప్రభుత్వం దృష్టి సారించింది.అయితే బడ్జెట్ సమావేశాలకు ప్రతిపక్షం టీడీపీ హాజరవుతుందా అన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. గత అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు తనను, తన భార్యను అసభ్య పదజాలంతో దూషించారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు సభ నుంచి వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. మళ్ళీ అధికారంలోకి వచ్చాకే అసెంబ్లీలో అడుగుపెడతానని శపథం చేశారు. ఈ నేపథ్యంలో బడ్జెట్ సమావేశాలకు టీడీపీ సభ్యులు హాజరుకావడం అనుమానంగా మారింది. టీడీపీ సభకు హాజరుకాకుంటే కొత్త జిల్లాల ఏర్పాటు, పీఆర్సీపై ప్రభుత్వ వైఖరి, ఓటీఎస్ పథకం వంటి అమలు విషయాల్లో ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే అవకాశం ఉండదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
 
Tags; 4 to 17 AP Assembly

Natyam ad