45 లక్షల దోపిడి చేసేశారు…

Date:19/06/2018
భువనేశ్వర్ ముచ్చట్లు:
పట్టపగలు దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. బ్యాంకులో చొరబడి ఏకంగా రూ.45 లక్షలు దోచేశారు. ఒడిషాలోని రూర్కెలాలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో జరిగిన ఈ భారీ చోరీ పోలీసులకు సవాల్ విసిరింది. బజార్‌ ప్రాంతంలో ఉన్న బ్రాంచ్‌ను ఉదయం సిబ్బంది ఓపెన్ చేశారు. కస్టమర్లు కూడా మెల్లి, మెల్లిగా వస్తున్నారు. 10 గంటల తర్వాత ఏడుగురు వ్యక్తులు మాస్క్‌లతో లోపలికి ప్రవేశించారు. వచ్చీరాగానే తుపాకీలు తీసి.. ఉద్యోగుల్నిు బెదిరించారు. భయంతో కస్టమర్లు కూడా ఎక్కడకక్కడే నిలబడిపోయారు. దొంగలు వెంటనే బ్యాంకులో రూ.45 లక్షల్ని సర్థుకొని అక్కడి నుంచి ఉడాయించారు. బ్యాంక్ సిబ్బంది ఇచ్చిన సమాచారంతో పోలీసులు స్పాట్‌కు వచ్చారు. అక్కడి సీసీ కెమెరాల ఫుటేజ్‌లను పరిశీలించారు. వెంటనే సరిహద్దులో ఉన్న చెక్‌పోస్టుల్ని అలర్ట్ చేసి.. దొంగల కోసం ప్రత్యేక టీమ్‌లతో గాలింపు మొదలుపెట్టారు. మరోవైపు చోరీ జరిగిన సమయంలో సెక్యూరిటీ గార్డు అక్కడ లేనట్లు తెలుస్తోంది. ఇలా పట్టపగలు బ్యాంకులో చొరబడి డబ్బు ఎత్తుకెళ్లడం ఒడిషాలో కలకలంరేపగా.. ఈ దొంగతనం జార్ఖండ్ గ్యాంగ్ పనిగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Tags:45 lakhs were exploited …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *