Natyam ad

 33 వ డివిజన్ నుండి జనసేనలోకి 50 కుటుంబాలు చేరిక

నెల్లూరుముచ్చట్లు:
నెల్లూరు గ్రామీణ నియోజవర్గ పరిధిలోని 33 వ డివిజన్, వెంగళరావు నగర్, ఏ బ్లాక్ నివాసులైన చిన్న రాజా, శంకర్ మరియు వారి సన్నిహితులు సుమారు 50 మంది పైగా జనసేన పార్టీలో చేరారు. స్థానిక వెంగళరావు నగర్ ఏ బ్లాక్ 15వ వీధి సెంటర్ నందు జనసేన పార్టీలోకి చేరికల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయసాధనకు భాగస్వాములుగా జిల్లాలోని పలు ప్రాంతాలలో జనసేనలోకి యువత నూతనంగా చేయడం జరుగుతుందన్నారు. పార్టీలో లో కొత్త పాతల సమన్వయ కలయికతో జిల్లాలో జనసేన పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో వైకాపా పాలనతో సామాన్య ప్రజల జీవనం కడు దీన పరిస్థితుల్లో ఉందన్నారు. అమ్మబోతే అడవి- కొనబోతే కొరివి అన్న చందంగా రాష్ట్రంలో వ్యవసాయ రైతుల పరిస్థితి ఉందన్నారు. ఆకాశ వండుతున్న ధరలు, రోజురోజుకు పెరుగుతున్న చమురు ధరలు, హెచ్ మీరుతున్న నిరుద్యోగ సమస్యలతో రాష్ట్ర ప్రజలు వైకాపా ప్రభుత్వ నియంతృత్వ పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు అవుతున్నారని పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లో రాష్ట్రంలో జనసేన అధికారంలోకి తప్పకుండా వస్తుందని, దీనికోసం రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా పార్టీలోకి నూతనంగా చేరిన వారిని పార్టీ కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించారు. అనంతరం పార్టీలో చేరిన చిన్న రాజా, శంకర్ మాట్లాడుతూ జనసేన పార్టీ యువజన నాయకులు గునుకుల కిషోర్ ప్రోత్సాహంతో మను క్రాంత్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరడం సంతోషకరంగా ఉందన్నారు. పార్టీ నియమ నిబంధనలకులోబడి పనిచేస్తూ,పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా రాజా ,శంకర్ ఆధ్వర్యంలో తొలుత స్థానిక డైక్రాస్ రోడ్డు నుండి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మనుక్రాంత్ రెడ్డికి, కిషోర్ కి మహిళలు హారతి పట్టి ఘనంగా ఆహ్వానించారు .ఈ కార్యక్రమంలో మునిరాజా, శివ, గోపి, సురేష్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
 
Tags:50 families join Janasena from 33rd Division