5000 fine using plastic

ప్లాస్టిక్ వాడితే 5000 ఫైన్

Date:23/06/2018
ముంబై ముచ్చట్లు:
నిత్యం వాడే ప్లాస్టిక్ వల్ల ఎన్ని అన‌ర్థాలు వ‌స్తాయో తెలిసి కూడా ప్ర‌జ‌లు విచ్చ‌ల‌విడిగా వాడేస్తున్నారు. అవ‌గాహ‌న లేమి, ప్ర‌త్యామ్నాయం లేక‌పోవ‌డంతో ప్లాస్టిక్‌ను విప‌రీతంగా వాడేస్తున్నారు. మ‌నం నిత్యం వాడే ప్లాస్టిక్ వినియోగాన్ని త‌గ్గించేందుకు ప్ర‌భుత్వాలు ఎన్నో ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. తాజాగా మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇదివ‌ర‌కూ చాలా రాష్ట్ర ప్ర‌భుత్వాలు, న‌గ‌ర పాల‌క సంస్థ‌లు ప్ర‌క‌టించిన విధంగా కాకుండా మ‌హారాష్ట్ర సంపూర్ణంగా ప్లాస్టిక్‌ను నిషేధించింది. నోటిఫికేష‌న్ ప్రకారం ప్లాస్టిక్ త‌యారీ, వాడ‌కం, అమ్మ‌కం, పంపిణీ, ప్లాస్టిక్ మెటిరీయ‌ల్ స్టోర్ చేసుకోవ‌డం వంటి వాటినన్నింటినీ బ్యాన్ చేసిన జాబితాలో చేర్చింది. దీన్ని ఉల్లంఘించిన వారికి భారీగానే ఫైన్ వేస్తామని ఆ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులు, స్పూన్లు, కప్పులు, బ్యాగ్లు, కంటైనర్లు, ఆహారాన్ని నిలువ చెడానికి ఉపయోగించే ప్లాస్టిక్ వస్తువులపై నిషేధం విధించింది. వాటిని తయారుచేసినా, ఉపయోగించినా, సరఫరా చేసినా, నిలువ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని ఆ ప్రభుత్వం హెచ్చరికలు జారీచేసింది. మొద‌టిసారి ప్లాస్టిక్ వాడుతూ ప‌ట్టుబ‌డితే రూ.5000 జ‌రిమానా విధిస్తారు. రెండో సారి ప‌ట్టుబ‌డితే రూ.10 వేలు వ‌దులుకోవాలి. మూడోసారి కూడా అలానే జ‌రిగితే రూ.25వేలు ఫైన్ క‌ట్ట‌డంతో పాటు జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. మాల్స్‌లోనూ ప్లాస్టిక్ బ్యాగ్‌లు అందుబాటులో ఉండ‌వు. ఇంకా ప్యాకేజింగ్ మెటీరియ‌ల్, థ‌ర్మోకోల్ ఆధారిత ఉత్ప‌త్తుల‌పైనా నిషేధం ఉంటుంది. అయితే మెడిసిన్ అండ్ డ్ర‌గ్స్‌, పాలు, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌కు ఉప‌యోగించే ప్లాస్టిక్ , ప్యాకేజీంగ్ త‌దిత‌రాల‌ను నిషేధం జాబితా నుంచి మిన‌హాయించారు.
ప్లాస్టిక్ వాడితే 5000 ఫైన్http://www.telugumuchatlu.com/5000-fine-using-plastic/
Tags; 5000 fine using plastic

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *