65వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన

-ఉత్తమ తెలుగు చిత్రం: ఘాజీ
-ఉత్తమ నటిగా శ్రీదేవి
Date:13/04/2018
న్యూఢిల్లీ  ముచ్చట్లు:
కేంద్రప్రభుత్వం 65వ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించింది. 65వ జాతీయ చలనచిత్ర అవార్డుల సెంట్రల్ ప్యానెల్ చైర్మన్ శేఖర్ కపూర్ అవార్డులను ప్రకటించారు. మరాఠీ చిత్రం మౌర్ఖ్యకు స్పెషల్ మెన్షన్ అవార్డు, ఒరియా చిత్రం హలో ఆర్‌సీ, మలయాళీ చిత్రం టేక్ ఆఫ్‌కు స్పెషల్ మెన్షన్ అవార్డులకు ఎంపికయ్యాయి. హిందీలో ఉత్తమచిత్రంగా న్యూటన్‌కు పురస్కారం లభించింది. ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రంగా లదాక్, ఉత్తమ పోరాట సన్నివేశ చిత్రంగా బాహుబలి-2, ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ అవార్డుకు బాహుబలి-2, మరాఠీలో ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రంగా కచ్చానింబు నిలిచాయి. మామ్ చిత్రానికి ఉత్తమ నటిగా శ్రీదేవికి పురస్కరం. తెలుగులో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఘాజీ.2017లో విడుదలైన తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళంలో వచ్చిన అద్భుతమైన చిత్రాలను పరిగణనలోకి తీసుకుని అవార్డు విజేతలను ప్రకటించారు.ఉత్తమ నటి: శ్రీదేవి (మామ్‌).ఉత్తమ నటుడు: రిద్ధీ సేన్‌(నగర్‌ కీర్తన్‌-బెంగాలీ),ఉత్తమ తెలుగు చిత్రం: ఘాజీ,ఉత్తమ హిందీ చిత్రం: న్యూటన్,ఉత్తమ మలయాళీ చిత్రం: టేకాఫ్,ఉత్తమ తమిళ చిత్రం: టు లెట్‌,ఉత్తమ మరాఠీ చిత్రం: కచ్చా నింబూ,ఉత్తమ కన్నడ చిత్రం: హెబ్బెట్టు రామక్క,ఉత్తమ బెంగాలీ చిత్రం: మయురాక్షి,ఉత్తమ యాక్షన్‌ చిత్రం: బాహుబలి-2,ఉత్తమ సంగీత దర్శకుడు: ఏ.ఆర్‌ రెహమాన్‌ (మామ్‌), (కాట్రు వెలియిదాయ్‌),ఉత్తమ కొరియోగ్రాఫర్‌: గణేశ్‌ ఆచార్య (టాయ్‌లెట్‌: ఏక్‌ ప్రేమ్‌కథా),ఉత్తమ దర్శకుడు: జయరాజ్‌ (మలయాళ చిత్రం భయానకం),ఉత్తమ సహాయ నటుడు: ఫహాద్ ఫాసిల్‌ (తొండిముత్తలం ద్రిసాక్షియుం),దాదాసాహెబ్‌ ఫాల్కే :బాలీవుడ్‌ నటుడు వినోద్‌ ఖన్నా,.తీయ అవార్డుల జ్యూరీ సభ్యులుగా ప్రముఖ నటి గౌతమి, ఇంతియాజ్‌ హుస్సేన్‌, గేయ రచయిత మెహబూబ్‌, పి.శేషాద్రి, అనిరుద్ధా రాయ్‌ చౌదరి, రంజిత్‌ దాస్‌, రాజేశ్‌ మపుస్కర్‌, త్రిపురారి శర్మ, రూమీ జఫ్రే ఉన్నారు. మే3న విజేతలకు అవార్డులు ప్రదానం చేస్తారు.
Tags:65th National Film Awards Announcement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *