Natyam ad

ఐదేళ్లలో పౌరసత్వం వదులుకున్న 8లక్షల మంది భారతీయులు..

న్యూఢిల్లీ  ముచ్చట్లు:
 
2016 నుండి 2021 వరకు సూమారు 8లక్షల మందికి పైగా భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నట్లు తాజాగా వెలువడిన భారత ప్రభుత్వ అధికారిక డేటా ద్వారా తెలిసింది. ఇక భారత పౌరసత్వం వదులుకున్న 8లక్షలకు పైగా మంది భారతీయుల్లో 2021 డిసెంబర్ వరకు సుమారు 6.10లక్షల మంది విదేశీ పౌరులుగా మారారు. ఇలా విదేశీ పౌరసత్వం తీసుకున్న వారిలో దాదాపు 42శాతం మంది అమెరికా పౌరులుగా మారారు. 2021 మొదటి తొమ్మిది నెలల్లోనే ఏకంగా 50వేల మంది భారతీయులు అమెరికా పౌరసత్వం పొందినట్లు డేటా వెల్లడించింది. దీంతో భారత పౌరసత్వం వదులుకుంటున్న వారి మొదటి చాయిస్‌గా అగ్రరాజ్యం అమెరికా నిలిచింది. యూఎస్ తర్వాత భారతీయులు అత్యధికంగా ఎంచుకుంటున్న దేశం కెనడా.
 
Tags; 8 lakh Indians lose their citizenship in five years