దామినేడు వద్ద 9 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

తిరుపతి ముచ్చట్లు:
తిరుపతి సమీపంలో రేణిగుంట మండలం దామినేడు వద్ద తొమ్మిది ఎర్రచందనం దుంగలను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ ఎస్పీ మేడా సుందర రావు ఆదేశాలతో డిఎస్పీ మురళీధర్, ఆర్ ఐ సురేష్ కుమార్ రెడ్డి నాయకత్వం లోని ఆర్ ఎస్ ఐ విశ్వనాథ్ టీమ్ మంగళవారం నుంచి కరకంబాడీ అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు. బుధవారం తెల్లవారుజామున దామినేడు వద్ద బండి బాటలో వెళుతుండగా. కొందరు ఎర్రచందనం దుంగలను మోసుకుని వెళుతూ కనిపించారు.  దీంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు వారిని వెంబడించగా, పోలీసులను చూసి దుంగలను పడవేసి పారి పోయారు. కాగా ఆ ప్రాంతంలో తొమ్మిది ఎర్రచందనం దుంగలు లభించాయి. వాటిని టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంఘటన స్థలానికి డిఎస్పీ మురళీధర్, ఆర్ ఐ సురేష్ కుమార్ రెడ్డి, సి ఐ లు వెంకట రవి, చంద్రశేఖర్ చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.  పరిసర ప్రాంతాలలో వీరి ఆచూకీ లభించే అవకాశాలు ఉన్నాయని, దీంతో ఈ ప్రాంతంలో నిఘా పెంచాలని నిర్ణయం తీసుకున్నారు.
 
Tags: 9 red sandalwood logs seized at Daminedu

Natyam ad