5గంటల బ్యాటరీ చార్జింగ్‌తో 100కిలోమీటర్ల ప్రయాణం-బ్యాటరీ ఆపరేటెడ్ గూడ్స్‌కు రిజిస్ర్టేషన్

హైదరాబాద్ ముచ్చట్లు :
హైదరాబాద్ నగర శివారు పెద్దఅంబర్‌పేట్‌లోని అడాప్టు మోటర్ కంపెనీ తయారుచేసిన బ్యాటరీ ఆపరేటేడ్ గూడ్స్ వాహనానికి గురువారం ఇబ్రహీంపట్నం ఆర్టీఓ కార్యాలయంలో రిజిస్ర్టేషన్ జరిగింది. 5 గంటలు చార్జింగ్ పెట్టినట్లయితే సుమారు 100కిలోమీటర్లవరకు ప్రయాణిస్తుంది. చార్జింగ్ కేవలం 5యూనిట్ల కరెంటు మాత్రమే ఖర్చవుతుందని మోటారు తయారీదారుడు మధుకర్‌రెడ్డి తెలిపారు. కిలో మీటర్‌కు కేవలం 20, లేదా 30 పైసలు అవుతుందన్నారు. ఈ-కార్టు, ఈ-రిక్షా పేర్లతో వాహనాలు యారుచేశామన్నారు. ఈ కార్టు వాహనం ధర రూ.లక్షా 45వేలు ఉంటుందన్నారు. ఐదు సంవత్సరాల వరకు దీని లైఫ్ ఉంటుందన్నారు. సుమారు 200 వాహనాలు తయారుచేసి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఓరిస్సా, బీహర్, కర్నాటకో విక్రయించామని మధుకర్‌రెడ్డి తెలిపారు. ఇదే తొలి రిజిస్ర్టేషన్: బ్యాటరీ ఆపరేటేడ్ గూడ్స్ వాహనాన్ని ఇక్కడ మొదటిసారిగా రిజిస్ర్టేషన్ చేయడం జరిగిందని ఇబ్రహీంపట్నం ఆర్టీఏ గోరవర్ధన్రెడ్డి తెలిపారు. ఆయన వాహనాన్ని నడిపి పరిశీలించా రు. గుర్రంగూడకు చెందిన రాజశేఖర్ ఈ వాహనాన్ని రూ.లక్షా 45వేలకు కొనుగోలు చేసి రిజిస్ర్టేషన్ కోసం మన్నెగూడలోని ఇబ్రహీంపట్నం ఆర్టీఏ కార్యాలయానికి తీసుకువచ్చారు.
Tag:A 100-kilometer journey with 5-hour battery charging


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *