మహిళల భద్రతకు పెద్దపీట: సబితా ఇంద్రారెడ్డి
హైదరాబాద్ ముచ్చట్లు:
సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో మహిళల భద్రతకు పెద్దపీట వేసినట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మంత్రి సత్యవతి రాథోడ్‌తో కలిసి మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మూడు రోజుల పాటు మహిళా దినోత్సవ వేడుకలు జరపాలని పార్టీ నిర్ణయించిందని తెలిపారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక సమాజంలో మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. కరోనా సమయంలో మహిళలకు, గర్భిణిలకు ఇబ్బంది లేకుండా చూసుకున్నామని పేర్కొన్నారు. గతంలో ఎండకాలం వస్తే నీళ్ల కోసం మహిళలు పడరాని పాట్లు పడేవారు. కేసీఆర్ సీఎం అయ్యాక మహిళలకు నీళ్ల కష్టం లేకుండా చేశారు.కేసీఆర్ ప్రభుత్వంలో మహిళల భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, ఈ క్రమంలోనే షీ టీమ్స్ ఏర్పాటు చేశారు. పోలీస్ శాఖలో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. మహిళలకు ఆర్థిక భద్రత కోసం.. వడ్డీ లేని లేకుండా రుణాలు ఇస్తోందన్నారు. మహిళలు రాజకీయంగా ఎదగాలని సీఎం కేసీఆర్ ఎప్పుడూ కోరుకుంటారని తెలిపారు. నామినేటెడ్ పోస్టులు మహిళలకు కేటాయించి ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించారని సబితా ఇంద్రారెడ్డి గుర్తు చేశారు. మూడు రోజుల పాటు జరిగే మహిళా దినోత్సవ వేడుకల్లో మహిళలందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.
Tags:Peta for Women’s Security: Sabita Indrareddy