పేదల బ్రతుకులు మార్చే బడ్జెట్.

–వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్
వరంగల్ ముచ్చట్లు:
:  బడ్జెట్ పేద వర్గాల తలరాతలు మార్చేవిదంగా ఉందని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. సోమవారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఆర్థిక శాఖా మంత్రి తన్నీరు హరీశ్ రావు ప్రవేశపెట్టిన బడ్జెట్ దళిత, బహుజన, బడుగు, బలహీన వర్గాలు, అన్ని వర్గాల ప్రజలకు ఉపయుక్తకరమైన బడ్జెట్ అని ఎమ్మెల్యే కొనియాడారు. ఇది కేసీఆర్ మార్క్ బడ్జెట్ అన్న అయన దళితబందు పథకానికి 17,700 కోట్ల రూపాయలు కేటాయించడం ద్వారా దళితుల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ కున్న ప్రేమను చాటుకున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల దళిత కుటుంబాలకు మేలు జరగనుందని చెప్పారు. సొంత జాగాలో ఇండ్లు నిర్మించుకునేందుకు  బడ్జెట్ లో 12వేల కోట్ల రూపాయల నిధులు కేటాయించడం పేదల సొంతింటి కలను నిజం చేసే నిర్ణయమని,   నియోజకవర్గానికి సొంతజాగా ఉన్నవారికి 3000 ఇండ్లు  రానున్నాయన్నారు. గతంలో 2200 డబుల్ బెడ్ రూం ఇండ్లతో కలుపుకుని మొత్తంగా నియోజకవర్గంలో 5200 పేదకుటుంబాలు సొంత ఇంటి కల నిజంకానుందని తెలిపారు.
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి కొత్త పథకం ప్రవేశ పెట్టడం శుభపరిణామమని,  మొదటి విడతలో లక్షమంది కార్మికులకు   మోటర్ సైకిళ్ళను ఇవ్వాలని నిర్ణయించడం ఒక చారిత్రాత్మక నిర్ణయమని ప్రశంసించారు.
రైతు బందు తరహాలో నేత కార్మికుల కోసం కొత్త పథకాన్ని ప్రారంభించాలని బడ్జెట్ సమావేశంలో తెలపడం సంతోషకరమని, నేతన్నల రాతలు మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. కొత్త పించన్ల లబ్దిదారులకు  రూ.11728 కోట్లు కేటాయించి కొత్త పించన్ దారులకు శుభవార్త అందించారన్నారు.  వ్యవసాయ, సాగునీరు, త్రాగునీరు రంగాలను మరింత గొప్పగా అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం సంతోషంగా ఉందని, పారిశుద్య కార్మికులకు, ఇతర సిబ్బందికి వేతనాలు పెంచాలని నిర్ణయం తీసుకోవడం సంతోషకరమన్నారు. ప్రతీ పారిశుద్య కార్మికులకు 5 వేల నుండి 7 వేల వరకు పెంచేల నిర్ణయం తీసుకున్నారని,  పారిశుద్య కార్మికుల కష్టాన్ని గుర్తించిన ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఎమ్మెల్యే కొనియాడారు. వరంగల్ లో మెడికల్ కళాశాలు ఏర్పాటు నిర్ణయంతో వైద్య విద్య మరింత చేరువైందన్నారు. బడులను బాగు చేసేలా మన ఊరు మనబస్తి మన బడి కార్యక్రమానికి నిధులు కేటాయించడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ కు పేద పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలనే సంకల్పం కనిపిస్తున్నదని, ఇది ప్రభుత్వ బడుల తలరాతలు మార్చే నిర్ణయమని పేద పిల్లలకు కార్పోరేట్ విద్య అందనుందని స్పష్టం చేశారు.
బడ్జెట్ పూర్తిగా పేదల పక్షాన ఉందని, ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగేలా, తెలంగాణ అభివృద్దిలో మరింత వేగంగా ముందుకు సాగేలా బడ్జెట్ ను అద్బుతంగా రూపొందించారని, ఇంత గొప్ప బడ్జెట్ ను రూపొందించిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి హరీశ్ లకు  ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ కృతజ్ఞతలు తెలిపారు.
Tags:A budget that changes the lives of the poor

Natyam ad