ముగ్గురు భార్యల కానిస్టేబుల్ రాసలీలలు

మేడ్చల్  ముచ్చట్లు:
ముగ్గురు భార్యలతో ఓ కానిస్టేబుల్ రాసలీలలు రచ్చకెక్కాయి. ఒక భార్యకు తెలియకుండా మరో భార్యను.. వీరిద్దరికి తెలియకుండా ముచ్చటగా మూడో పెళ్లి కూడా చేసుకున్నాడు. ఇక మూడు చోట్ల కాపురాలు పెట్టేశాడు. మూడో భార్యతో ఉండగా.. మొదటి భార్య రెడ్ హ్యాండెడ్గా తన కుమారుడితో కలిసి హెడ్ కానిస్టేబుల్ రాజేంద్రను పట్టుకుంది. ఈ ఘటన మేడిపల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని ఫీర్జాదిగూడలో ఆదివారం చోటు చేసుకుంది. మూడో మహిళను మొదటి భార్య చితకబాదింది. తండ్రికి, తనయుడికి మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. అయితే రాజేంద్ర రాసలీలలపై మొదటి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ సందర్బంగా మొదటి భార్య విలేకరులతో మాట్లాడుతూ… ముగ్గురు మహిళలతో అక్రమ సంబంధాలు నడుపుతున్నాడని, దీనివల్ల తమ కుటుంబంలో మనశ్శాంతి లేకుండా పోతోందని, పిల్లల భవిష్యత్ నాశనమవుతుండడంతో వేరేదారి లేక ఆయన బండారం బయటపెట్టాల్సి వచ్చిందన్నారు. రాజేంద్ర వరంగల్ జిల్లా సుబేదారి మహిళా పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు.
Tag : A constable racist with three wives

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *