నిత్యావసర వస్తువుల ధరలు పెంచుతున్న వ్యాపారులపై  క్రిమినల్ కేసు నమోదు చేయాలి.

-ఆర్ డి ఓ  కార్యాలయం పరిపాలన అధికారి హరినాద్ రావు కు వినతి పత్రం అందజేసిన సిపిఐ నేతలు…
నంద్యాల ముచ్చట్లు:
యుద్ధాన్ని అడ్డం పెట్టుకొని నంద్యాల డివిజన్ పరిధిలో నిత్యావసర సరుకుల ధరలను పెంచుతున్న వ్యాపారస్తులపై చర్యలు తీసుకొని క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరుతూ నంద్యాల ఆర్డీవో కార్యాలయంలో ఈ రోజు ఏవో హరనాథ్ రావు కి వినతిపత్రం అందజేసిన సీపీఐ నేతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు బాబా ఫక్రుద్దీన్,  ఏ ఐ కె ఎస్ కార్యదర్శి సోమన్న,బి కె ఎం యు కార్యదర్శి సుబ్బారాయుడు,ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ధనుంజయుడు,గోస్పాడు సీపీఐ కార్యదర్శి చెన్నయ్య, ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు సురేష్, ఏఐఎస్ఎఫ్ నంద్యాల పట్టణ ఆర్గనైజింగ్ కార్యదర్శి మనోహర్,ఉపాధ్యక్షుడు లోకేష్ తదితరులు పాల్గొన్నారు.
 
Tags:A criminal case should be registered against the traders who are raising the prices of essential commodities.

Natyam ad