బండరాళ్ల మధ్యలో భారీ వృక్షం.

-100 ఏళ్ళు నాటి చెట్టు .. తంటికొండ దేవస్థానం పై అందర్ని ఆకర్షిస్తున్న నెమలి వృక్షం
గోకవరం ముచ్చట్లు:
బండరాళ్ల మధ్యలో భారీ వృక్షం అందర్ని ఆశ్చర్య పరుస్తుంది…100 ఏళ్ల నాటి చెట్టు నీడలో భక్తులు సేద తీరుతున్నారు… వృక్షం వేర్లు రాళ్ళల్లోకి చొచ్చుకుపోయి అందర్ని ఆశ్చర్య పరుస్తున్నాయి… వీటిని ఆశక్తికరంగా గమనిస్తున్నారు.. ఇదెక్కడో అడవుల్లోనో, దూర ప్రాంతాల్లోనో అనుకుంటున్నారా.. కాదు అందరికి దగ్గరగా, భగవంతుని కొండ పై ఉంది.. గోకవరం మండలంలో తంటికొండ వెంకటేశ్వర స్వామి పుణ్యక్షేత్రం ఉంది.. రాష్ట్ర స్థాయిలో ఈ ఆలయానికి మంచి గుర్తింపు ఉంది.. ప్రతి శనివారం విశేష సంఖ్యలో భక్తులు వచ్చి దేవదేవుణ్ణి దర్శించుకుంటారు.. ఇటీవల అన్నమయ్య భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.. కొండ పై భాగంలో అన్నమయ్య విగ్రహం పక్కనే భారీ వృక్షం ఉంది.. దీని పేరు నెమలి చెట్టు.. ఇక్కడ ఆలయం నిర్మించక ముందు నుండి చెట్టు ఉందని ఆలయ అధికారులు, ఉద్యోగులు, స్థానికులు చెపుతున్నారు.. ఈ వృక్షానికి చుట్టూ బండరాళ్లే ఉంటాయి.. చాలా పెద్ద పెద్ద బండరాళ్ల మధ్యలో ఉంది.. నలువైపులా బండరాళ్ల ఉండి, వేర్లు రాళ్ళ లోపలికి చొచ్చుకుపోయాయి.. ఈ వృక్షాన్ని అందరు ఆశక్తిగా చూస్తున్నారు.. ఒక మొక్క పెరగటానికి చదునైన ప్రదేశం కావాలి.. నీటి వనరులు ఉండాలి..కానీ ఇక్కడ భారీ బండరాళ్ల మధ్యలో వృక్షం ఉండటం అరుదైన విషయం..భక్తులు ఈ చెట్టు నీడలోనే సేద తీరుతున్నారు.. వాహనాలు ఈ వృక్షం నీడలోనే ఉంటున్నాయి..ఈ భారీ వృక్షానికి మరికొన్ని రక్షణ ఏర్పాట్లు చేయాల్సి ఉంది.. చెట్టు చుట్టూ వెంకటేశ్వర స్వామి నామాలు వేస్తే చాలా బావుంటుందని భక్తులు సూచిస్తున్నారు.. ఇటువంటి అరుదైన చరిత్ర ఉన్నవాటిని అధికారులు దృష్టి సారించి, అందరికి తెలిసేలా చర్యలు చేపట్టాల్సి ఉంది..
 
Tags:A huge tree in the middle of the rocks

Natyam ad