A husband with a blade

బ్లేడుతో గొంతుకోసుకున్న భర్త

Date:10/01/2019

పుంగనూరు ముచ్చట్లు:

కుటుంబంలో బార్య, భర్తల మధ్య తీవ్ర గొడవలు రావడంతో మనస్థాపానికి గురైన భర్త బ్లేడుతో గొంతుకోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన పుంగనూరు మండలం పాలెంపల్లెలో గురువారం సాయంత్రం జరిగింది. మదనపల్లెలో నివాసం ఉన్న అన్వర్‌బాషా పుంగనూరు మండలానికి చెందిన అయిషాతో వివాహం జరిగింది. గత కొంత కాలంగా కుటుంబంలో కలహాలు రావడంతో అయిషా పాలెంపల్లెకు వచ్చి తల్లిదండ్రుల వద్ద ఉంది. ఈ నేపధ్యంలో అన్వర్‌బాషా తన భార్య వద్దకు వచ్చాడు. తగువలాడుకుంటు బ్లేడుతో గొంతుకోసుకున్నాడు. దీంతో తీవ్ర రక్తగాయమై, పడిపోవడంతో కుటుంబ సభ్యులు 108కు సమాచారం అందించారు. 108ల్యో బాధితుడిని మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించి , చికిత్సలు చేపట్టారు. ప్రస్తుతం అన్వర్‌బాషా ప్రాణపాయస్థితిలో ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పుంగనూరు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

పుంగనూరులో వైభవంగా ముగిసిన ఇస్తిమా

Tags: A husband with a blade

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *