ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం-మంత్రి తలసాని

హైదరాబాద్ ముచ్చట్లు:

నాలాల అభివృద్ధి తో వరదముంపు కు శాశ్వత పరిష్కారమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం నాడు మంత్రి బేగంపేట నాలా అభివృద్ధి పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. మంత్రి మాట్లాడుతూ ప్రతి ఏటా వర్షాకాలంలో నాలా పరిసర కాలనీలు వరదముంపుకు గురవుతున్నాయి. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్  చొరవతో ముంపు సమస్య శాశ్వత పరిష్కారానికి ఎస్ఎన్డీపీ  కార్యక్రమం ద్వారా నాలాల పూర్తిస్థాయి అభివృద్ధి చేస్తున్నాం. ప్రతి ఏటా వర్షాకాలంలో బేగంపేట నాలా పరిసర కాలనీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే వారు. కాలనీలు మొత్తం నీట మునిగిపోయేవి. 45 కోట్ల రూపాయల వ్యయంతో బేగంపేట నాలా అభివృద్ధి పనులు చేస్తున్నాం. ఎన్నో సంవత్సరాల ఈ సమస్య శాశ్వతంగా పరిష్కారం కానున్నది. గత ప్రభుత్వాలు నాలాల అభివృద్ధి కి ఎలాంటి చర్యలు చేపట్టలేదు. వరదల సమయంలో వచ్చి కనిపించారే తప్ప సమస్య ను పరిష్కరించాలనే ఆలోచన కూడా చేయలేదు. ప్రజల సమస్యల పరిష్కారమే  తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.

 

Tags:A permanent solution to the flood problem-Minister Talasani

Post Midle
Post Midle
Natyam ad